https://oktelugu.com/

Saripodhaa Sanivaaram: 2 తెలుగు రాష్ట్రాల్లో వరదల ఉదృతి తగ్గింది..కానీ ‘సరిపోదా శనివారం’ వసూళ్ల సునామి తగ్గలేదు..5 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయంటే!

మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఊహించిన విధంగానే ఓపెనింగ్ వసూళ్లను దంచి కొట్టేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి నాని కెరీర్ లో 'దసరా' తర్వాత బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన చిత్రం గా నిల్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 3, 2024 / 04:16 PM IST

    Saripodhaa Sanivaaram 5 days Box Office Collections

    Follow us on

    Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తూ ఎలా దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఊహించిన విధంగానే ఓపెనింగ్ వసూళ్లను దంచి కొట్టేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి నాని కెరీర్ లో ‘దసరా’ తర్వాత బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన చిత్రం గా నిల్చింది. ఒకపక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, ఎక్కడ చూసిన వరద బీభత్సం, రోడ్ల మీద పడవలు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు, ఇన్ని ప్రతికూల వాతావరణాలు ఏర్పడినా కూడా ఈ చిత్రానికి వసూళ్ల జోరు తగ్గలేదు. నాని అంటే ఒక బ్రాండ్ ఇమేజి ఆడియన్స్ లో ఏర్పడింది కాబట్టి వీకెండ్ వసూళ్లు బాగానే ఉంటాయి, కానీ లాంగ్ రన్ లో ఇలాంటి సినిమాలు ఆడవు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు.

    కానీ వాళ్లందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా ఈ సినిమా వసూళ్లు సోమవారం నాడు కూడా అదిరిపోయాయి. ఏ సినిమా లాంగ్ రన్ అయినా మొదటి సోమవారం వసూళ్ల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతీ సినిమాకి ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఆ అగ్ని పరిక్షలో ‘సరిపోదా శనివారం’ చిత్రం డిస్టింక్షన్ లో పాస్ అయ్యింది. దీంతో ఈ చిత్రం కచ్చితంగా లాంగ్ రన్ లో కూడా అదరగొట్టేస్తుంది అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఏర్పడ్డాయి. ట్రేడ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 5 వ రోజు 2 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    ఇప్పటి వరకు ప్రాంతాల వారీగా 5 రోజులకు గాను ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 10 కోట్లు, సీడెడ్ లో 2 కోట్ల 70 లక్షలు, ఉత్తరాంధ్ర లో 2 కోట్ల 50 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటి 32 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 87 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి 20 లక్షలు, కృష్ణ జిల్లాలో కోటి 30 లక్షలు, నెల్లూరు జిల్లాలో 77 లక్షలు, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 రోజులకు ఈ చిత్రం 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఈ చిత్రానికి 42 కోట్ల రూపాయలకు జరిగింది, అంటే బ్రేక్ ఈవెన్ కి 7 కోట్ల రూపాయిలు అవసరం ఉంది. ఈ వారం లోనే ఆ మార్కుని ఈ చిత్రం అందుకునే అవకాశం ఉంది. ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, చూడాలి మరి.