Singer Kalyani Chintha: సరిగమప షో: విడాకులైనా.. విధి పగబట్టినా.. ఇద్దరు బిడ్డలతో స్వరాల సాగరంలో గెలిచిన కళ్యాణి

Singer Kalyani Chintha: పాటల పూదోటలో విరబూయడమే కాదు.. ఆ గాయకుల తెరవెనుక జీవితాలను ఆవిష్కరిస్తోంది జీ తెలుగులోని ‘సరిగమప షో’. ఈ ఆదివారం ప్రసారమైన ఈ షోలో పలువురి గాయకుల తెరవెనుక జీవితాలు బయటపడ్డాయి. వారి కష్టాలు కళ్లకు కట్టాయి.. అవి అందరిలోనూ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. కళ్యాణి అనే మహిళ క్రితం సారి బాగా పడింది. ఈసారి బాగా పాడినా కాస్త తడబడింది. పాట ముగిశాక జడ్జీలు అడిగినప్పుడు ఆమె అలా తడబాటుకు గల కారణాలు […]

Written By: NARESH, Updated On : March 7, 2022 8:59 am
Follow us on

Singer Kalyani Chintha: పాటల పూదోటలో విరబూయడమే కాదు.. ఆ గాయకుల తెరవెనుక జీవితాలను ఆవిష్కరిస్తోంది జీ తెలుగులోని ‘సరిగమప షో’. ఈ ఆదివారం ప్రసారమైన ఈ షోలో పలువురి గాయకుల తెరవెనుక జీవితాలు బయటపడ్డాయి. వారి కష్టాలు కళ్లకు కట్టాయి.. అవి అందరిలోనూ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి.

Singer Kalyani Chintha

కళ్యాణి అనే మహిళ క్రితం సారి బాగా పడింది. ఈసారి బాగా పాడినా కాస్త తడబడింది. పాట ముగిశాక జడ్జీలు అడిగినప్పుడు ఆమె అలా తడబాటుకు గల కారణాలు చెప్పి కన్నీళ్ల పర్యంతం అయ్యింది. మహిళా దినోత్సవాన ఆ మహిళ పంచిన తన వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్ల స్ఫూర్తి కథ ఇప్పుడు అందరికీ కనువిప్పు కలిగిస్తోంది. మహిళల ధీరత్వానికి.. పట్టుదలకు.. మహిళాశక్తికి అద్దంపడుతోంది. మహిళలు తలుచుకుంటే సాధించనిది ఏదీ లేదని అర్థమవుతోంది.

Also Read:  భీమ్లా నాయక్ లో రానా పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..

18 ఏళ్లకే లవ్ మ్యారేజ్ చేసుకున్న ‘కళ్యాణి’ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ భర్త పెట్టే బాధలు చూడలేక నాలుగేళ్లకు విడాకులిచ్చింది. తల్లిదండ్రులు ఇలా చిన్న చిన్న గొడవలు సర్దుకోవాలన్నా.. ఆ శాడిస్టు భర్తను వినూత్న భరించలేకపోయింది. పిల్లలకు కూడు, గుడ్డ పెట్టలేని భర్తను చీకొట్టింది. అనంతరం సొంతంగా జాబ్ సంపాదించి వారికి ఇప్పుడు మూడు పూటలా మంచి భోజనం, వసతి కల్పిస్తోంది.

భర్తతో విడాకులు తీసుకొని సొంతంగా తన కాళ్లపై తాను నిలబడ్డ వినూత్న తనకు ఇష్టమైన పాటలను వదిలిపెట్టలేదు. సరిగమప షోలో పాటల ఫైట్ లోనూ పాలుపంచుకొంది. తోటి కంటెస్టెంట్ తో ప్రతీసారి పాడింది. ఈసారి తన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను చూస్తూ కాస్త తడబడింది. వారి ముందూ ఆనంద భాష్పాలతో కొంచెం తత్తరపాటుకు గురైంది.

Singer Kalyani Chintha

బాగా పాడే కళ్యాణి అలా ఎందుకు చేసిందంటే.. తన ఇద్దరు కొడుకుల ముందు పాడడం ఇదే తొలిసారని.. వారి కోసమే నేను ఇదంతా చేస్తోందని.. అందుకే అన్నీ గుర్తుకు వచ్చి అలా జరిగిందని వివరణ ఇచ్చింది. ఆమె కష్టాన్ని అర్థం చేసుకున్న జడ్జీలు అభినందించారు.

ఇక ఈమెతో పాటు పాడిన మేల్ సింగర్ ది మరో కథ. అతడు కరోనా లో జాబ్ కోల్పోయి ఆయన తల్లికి ఇష్టం లేకున్నా సంగీతం నేర్చుకొని గాయకుడి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అతడి తల్లికి కొడుకు భవిష్యత్తుపై బెంగ. కొడుకు ఏమైపోతాడేమోనన్న భయం. అందుకే స్టేజీపై కన్నీళ్లు కార్చింది. జడ్జీలు, తోటి గాయకులు భరోసానిచ్చారు. ఈ ఎపిసోడ్ లో ఇలా ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లోని ఎమోషనల్ జర్నీ ప్రేక్షకులను కదిలించింది.

Also Read: మన టాలీవుడ్ స్టార్లు, వారి తోబుట్టువులు ఎవరో తెలుసా ?

Tags