Site icon OkTelugu

Pakistan: పాకిస్తాన్‌కు కశ్మీర్‌ సాలిడారిటీ డే సంతోషం కూడా దూరం..

Pakistan

Pakistan

Pakistan: ఫిబ్రవరి 5న పాకిస్తాన్‌కు చాలా ముఖ్యమైన తేదీ. ఏటా ఈ రోజు కశ్మీర్‌ను తమ భాగంగా చూపి సాలిడారిటీ డే జరుపుకుంటుంది. అయితే ఈ ఏడాది సాలిడారిటీ డే సంతోషం కూడా దూరమైంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప పాకిస్తాన్‌కు షాక్‌ ఇచ్చాడు. ఇంకోవైపు కశ్మీర్‌ యువకులు త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు తీశారు.

సుంకాలు తగ్గించిన అమెరికా..
లాలిడాటరీ కోసం పాకిస్తాన్‌ సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌ ఇచ్చారు. ఈ డేకు ఒకటి రెండు రోజుల ముందు భారత్‌పై 50 శాతం వరకు ఉన్న టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి ముందుకు వచ్చాడు. భారత్‌ చెప్పిన కండీషన్ల మేరకే ఒప్పందానికి సై అన్నాడు. ఇది పాకిస్తాన్‌ ఆశలకు గండి కొట్టింది.

శ్రీనగర్‌లో త్రివర్ణ పతాక ర్యాలీలు..
ఇదిలా ఉంటే కశ్మీర్‌ సంఘీభావ దినం రోజు శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, సోపూర్‌ ప్రాంతాల్లో వందలాది ముస్లిం యువకులు త్రివర్ణ పతాకాలు పట్టుకుని ’ఇండియా జిందాబాద్‌’ నినాదాలతో ఊరేగింపులు చేశారు. పాక్‌ ప్రచారం – కశ్మీర్‌లో ముస్లింలపై అత్యాచారాలు, స్వేచ్ఛ లేకపోవడం వంటి తప్పుడు కథనాలను ఈ ర్యాలీలతో ఖండించబడింది. సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారి పాక్‌ ప్రయత్నాలకు మరో దెబ్బ.

అభివృద్ధికి నోచుకోని పీవోకే..
1948 యుద్ధం తర్వాత పాక్‌ జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని భూభాగాలను తీసుకుంది అదే ఇప్పుడు పీవోకే. అయితే స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు అయినా పీవోకేలో మౌలిక సదుపాయాలు లేకపోయాయి. ఆస్పత్రులు, రోడ్లు, యూనివర్సిటీలు లేకపోవడంతో స్థానికులు నిరసనలు చేస్తున్నారు. ఇక భారత కాశ్మీర్‌లో అయితే 11 యూనివర్సిటీలు, 1752 కి.మీ. గ్రామీణ రోడ్లు, 2000 స్టార్టప్‌లు, పర్యాటక ఉత్సాహం, అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉన్నాయి. పహల్గాం ఘటన తర్వాథ కూడా టూరిస్టులు తగ్గలేదు.

పాక్‌ ఇస్లామిక్‌ ఐక్యత పేరుతో కశ్మీర్‌పై తప్పుడు కథనాలు చేస్తూ డే జరుపుకోవడం విఫలమైంది. భారత్‌తో అమెరికా ఒప్పందం, కశ్మీరీల స్వచ్ఛంద ర్యాలీలు పాక్‌ వాదనలను బలహీనపరిచాయి. పీవోకేలో ఉగ్రవాదం, భారత కాశ్మీర్‌ స్థిరత్వం, పురోగతి పాక్‌కు ఇబ్బందికరం.

Exit mobile version