Sarainodu : అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాలలో ఒకటి ‘సరైనోడు'(Sarainodu). ఈ చిత్రం నుండే అల్లు అర్జున్ సినీ కెరీర్ లో సరికొత్త చాప్టర్ మొదలైంది. అప్పటి వరకు అల్లు అర్జున్ అంటే కేవలం ఒక యూత్ ఫుల్ హీరో, క్లాస్ సినిమాలు చేస్తాడు, లవ్ స్టోరీస్ బాగా సెట్ అవుతాయి, డ్యాన్స్ అద్భుతంగా చేస్తాడు, ఇలాంటివి మాత్రమే ఆయన గురించి వినిపించేవి. కానీ బోయపాటి శ్రీను అల్లు అర్జున్ ని అభిమానులు, ఆడియన్స్ అప్పటి వరకు చూడని సరికొత్త కోణం లో చూపించి థ్రిల్ కి గురి చేసాడు. అల్లు అర్జున్ కేవలం యూత్ ఫుల్ స్టోరీస్, లవ్ స్టోరీస్ మాత్రమే కాదు, మాస్ జానర్ సినిమాలు కూడా అద్భుతంగా చేయగలడు అని నిరూపించిన చిత్రమిది. ఈ సినిమాకు ఆరంభం చాలా డివైడ్ టాక్ వచ్చింది.
Also Read : అల్లు అర్జున్, శ్రీలీల పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..ప్రకంపనలు రేపుతున్న వివాదం!
ఆ రేంజ్ డివైడ్ టాక్ వస్తే వేరే హీరో ఏ రేంజ్ కి ఆ సినిమాని బాక్స్ ఆఫీస్ వద్ద తీసుకెళ్లేవాడా తెలియదు కానీ, అల్లు అర్జున్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిపాడు ఈ చిత్రాన్ని. అప్పట్లోనే దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకు 61 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 97 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 76 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో వచ్చినంత వసూళ్లు, ఎందుకో ఈ చిత్రానికి అప్పట్లో ఓవర్సీస్ లో రాలేదు. నార్త్ అమెరికా లో అయితే కనీసం మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. అక్కడ కూడా మంచి వసూళ్లు వచ్చి ఉండుంటే కచ్చితంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది.
బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ అయ్యింది. కానీ ఆరోజుల్లో మాత్రం వచ్చిన డివైడ్ టాక్ కి, ఆ స్థాయి లాంగ్ రన్ ని చూసి బయ్యర్స్ కి కూడా మతి పోయింది. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్, కాథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటించగా, ఆది పిన్ని శెట్టి విలన్ గా నటించాడు. ఇక థమన్ అందించిన మాటలు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అప్పట్లో ఒక సెన్సేషన్. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చి నేటికీ 9 ఏళ్ళు దాటింది. ఈ సందర్భంగా అభిమానులు ఈ సినిమా సాధించిన రికార్డ్స్ ని సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు చెప్పుకుంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.
Also Read : అల్లు అర్జున్ వల్లే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం నష్టాలను చవి చూస్తుందా..?