Mahesh Babu and Allu Arjun : ఎందుకో తెలీదు కానీ, ఈమధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఈమధ్య కాలంలో ఎప్పుడూ జరగని విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అరెస్ట్ అవ్వడం ఒక సెన్సేషన్ ని సృష్టించింది. అప్పుడెప్పుడో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి వారు అరెస్ట్ అవ్వడం చూసాము కానీ, మన టాలీవుడ్ లో ఒక పేరున్న హీరో అరెస్ట్ అవ్వడం ఇదే తొలిసారి అనుకోవచ్చు. అదే విధంగా ఈమధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ విషయం లో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి స్థాయి వ్యక్తులు కూడా మీడియా కి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) కి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
Also Read : మహేష్ బాబు ప్రభాస్ కి దక్కాల్సిన క్రెడిట్ ను ఆ ఇద్దరు స్టార్ హీరోలు కొట్టేస్తారా..?
ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ, వేలమంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి, ఒక్కటంటే ఒక్క కాంట్రవర్సి కూడా లేకుండా జీవించే మహేష్ బాబు లాంటి ఉన్నతమైన వ్యక్తి ఏమి తప్పు చేశాడని ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసారు అంటూ సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు మండిపడుతున్నారు. నిజంగా ఇందులో మహేష్ తప్పు ఏమి లేదు, ఆ సంస్థ కమర్షియల్ ప్రకటన లో నటించాడు, అందుకోసం ఆయన రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. ఆయన రెమ్యూనరేషన్ కి మనీ లాండరింగ్ కి ఎలాంటి సంబంధం లేదు. కానీ మహేష్ కి చెక్ రూపం 3 కోట్ల 50 లక్షలు, RTGS ద్వారా రెండు కోట్ల 50 లక్షల రూపాయిలు అందాయి. ఆ రెండు కోట్ల 50 లక్షల రూపాయిలు మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన సొమ్మే మహేష్ ఖాతాలోకి వెళ్ళిందేమో అని ఈడీ అధికారులు అనుమానిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తుంది.
ఇందులో నిజానిజాలు ఎంతో ఈ నెల 27న మహేష్ ని విచారించిన తర్వాత తెలియనుంది. అయితే మహేష్ తన టీం తో అయినా ఈ విషయం గురించి స్పందిస్తాడని అందరు ఆశిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మహేష్ వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీని పూర్తి వివరాలు 27 వరకు బయటకు వచ్చే అవకాశాలు.లేదు. ఇదంతా పక్కన పెడితే ఒకప్పటి లాగా ఇప్పుడు అసలు లేదు, స్టార్ హీరోలు ఒక కమర్షియల్ యాడ్ చేసేటప్పుడు కచ్చితంగా ఒకటికి వందసార్లు అలోచించి మరీ చేయాలి అనే సంకేతం ఇప్పుడు స్పష్టంగా వెళ్తుంది. ఇది కేవలం అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి వారితో ఆగిపోతుంది అనుకుంటే పొరపాటే. భవిష్యత్తులో అందరి హీరోలను సోదా చేసే చేసే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్ని చూడాలి అనేది.
Also Read : జంతువులు.. రోబోలు.. అల్లు అర్జున్-అట్లీ కథ ఏంటంటే..?