Allu Arjun And Sreeleela: ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ సెలబ్రిటీలు అత్యధిక శాతం పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగడం వంటివి చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అరెస్ట్ ఘటన కేవలం టాలీవుడ్ ని మాత్రమే కాదు, ఇండియా నే ఉలిక్కిపడేలా చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఉదంతం మన అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం లో గాయపడ్డ శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే ఉన్నాడు. దురదృష్టం కొద్దీ జరిగిన ఈ సంఘటన అల్లు అర్జున్ ని తీవ్రమైన మనోవేదనకు గురి చేసింది. చేయని తప్పుకి ఎంతో అప్రతిష్ట కూడా ఆయన మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్య సర్దుకుంది, ఇక అల్లు అర్జున్ మామూలు జీవితంలోకి అడుగుపెట్టేసాడు, వరుసగా సినిమాలు చేస్తాడు అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరో వివాదం ఆయన మెడకు చుట్టుకుంది. ఇది ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో తెలియదు కానీ, కాస్త సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది.
Also Read: మరో చారిత్రాత్మక రికార్డుని నెలకొల్పిన ‘చావా’..10 వ వారం వచ్చిన వసూళ్లు ఎంతంటే!
కేవలం అల్లు అర్జున్ మీద మాత్రమే కాదు, ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Heroine Sree Leela) పై కూడా ఈ కేసు నమోదు అయ్యింది. అసలు విషయానికి వస్తే రీసెంట్ గానే JEE ఫలితాలు వెల్లడయ్యాయి. పలు టాప్ కాలేజీలు టాప్ ర్యాంకర్స్ తమ కాలేజిలోనే చదివారు అంటూ పోటాపోటీగా పత్రికల్లో యాడ్స్ ఇచ్చాయి. అయితే కొన్ని కాలేజీలు మా కాలేజ్ ద్వారా ర్యాంక్ పొందిన విద్యార్థులకు సంబంధించిన ఫోటోలను, వేరే కాలేజ్ ర్యాంకర్స్ గా ఎలా పెట్టారు?, ఒకేసారి రెండు కాలేజీల నుండి ఎలా ర్యాంక్ సంపాదిస్తారు? అంటూ ప్రశ్నించారు. కొన్ని టాప్ కాలేజులు ర్యాంక్ సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి తమ కాలేజ్ ద్వారా ర్యాంక్ సంపాదించినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి పలు కార్పొరేట్ కాలేజీలకు అల్లు అర్జున్, శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి, ఆ కాలేజీలను ప్రమోట్ చేసారని, వీళ్ళ ప్రచారం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లి దండ్రులు నష్టపోతున్నారని AISF పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే లక్షల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని తీసుకొని, ఆ కాలేజీల బాగోతం తెలుసుకోకుండా, విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో AISF పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రకటనలపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరి దీనిపై అల్లు అర్జున్, శ్రీలీల ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా తన కెరీర్ ని సాగిస్తున్న శ్రీలీల ఇలాంటి కేసు లో చిక్కుకుంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆమె అభిమానులు కూడా దీనిపై స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా స్వయంగా స్పందించకపోయిన తన పీఆర్ టీం ద్వారా రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.