https://oktelugu.com/

అలియాకు రాజ‌మౌళి స్పెష‌ల్‌ ఆఫ‌ర్‌.. RRRలో స‌రికొత్త రోల్‌!

మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లలో తారక్ – చరణ్ పెర్ఫార్మెన్స్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. Also Read: ప్లాప్ అయితే […]

Written By:
  • Rocky
  • , Updated On : February 14, 2021 / 05:42 PM IST
    Follow us on


    మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లలో తారక్ – చరణ్ పెర్ఫార్మెన్స్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.

    Also Read: ప్లాప్ అయితే ఇక దుకాణం సర్ధేసుకోవడమే !

    డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని మొత్తం ఐదు భాషల్లో.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు రాబోయే దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు జక్కన్న. అక్టోబర్ 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

    Also Read: ఉప్పెన హీరోయిన్ వ‌య‌సు తెలుసా..? మ‌రీ ఇంత చిన్న పిల్లా..!

    ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ అమ్మడు కేవలం యాక్టింగ్ లోనే కాదు.. పాటలు పాడటంలోనూ తోపే! చాలా మంది హీరోలు, హీరోయిన్లు యాక్టింగ్ క‌మ్ సింగింగ్ చేసే టాలెంట్ ను సొంతం చేసుకున్న‌వారే! వారిలో స‌భ్యురాలైన అలియా.. ఏకంగా RRRలో టాలెంట్ చూపించ‌బోతోంది!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    అవును.. ఈ సినిమాలో అలియాకు పాట పాడే ఛాన్స్ ఇచ్చాడ‌ట ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఐదు భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుండ‌గా.. హిందీ వ‌ర్ష‌న్ లో సాంగ్ వేసుకొనే అవ‌కాశం ఇచ్చాడ‌ట జ‌క్క‌న్న‌. మిగిలిన భాష‌ల్లో లిరిక‌ల్ ప్రాబ్లం వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో.. హిందీ వ‌ర‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చాడ‌ట‌. సో.. RRRలో తెర‌పై అలియా న‌ట‌న‌తోపాటు.. తెర వెన‌క నుంచి అందించే గానామృతాన్ని కూడా టేస్ట్ చేయొచ్చ‌న్న‌మాట‌.