Homeఎంటర్టైన్మెంట్Sara Alikhan: విజయ్​ దేవరకొండతో కలిసి నటించాలని ఉందన్న బాలీవుడ్ స్టార్​ హీరోయిన్​

Sara Alikhan: విజయ్​ దేవరకొండతో కలిసి నటించాలని ఉందన్న బాలీవుడ్ స్టార్​ హీరోయిన్​

Sara Alikhan: పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. అర్జున్ రెడ్డితో సంచలన సృష్టించిన హీరో విజయ్​ దేవరకొండ. ఈ సినిమాతో యూత్​లో మంచి క్రేజ్​ దక్కించుకున్నారు విజయ్​. ఈ క్రమంలోనే వరుసగా గీతాగోవిందం, డియర్​ కామ్రెడ్​ చిత్రాలతో మంచి టాక్​ తెచ్చుకుని.. ఇప్పుడు అసలు తీరిక లేకుండా బిజీ షెడ్యూల్​తో గడుపుతున్నారు. ప్రస్తుతం పూరిజగన్నాథ్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లైగర్ సినిమాలో నటిస్తున్నారు. విజయ్​ మ్యాన్సీ లుక్​కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.  ఈ క్రమంలోనే విజయ్​తో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చాలా మంది హీరోయిన్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. తాజాగా, మరో బాలీవుడ్​ హీరోయిన్​ విజయ్​కో కలిసి నటించాలని ఉందని మనసులో మాట చెప్పేసింది.

bollywood actress sara ali khan apologies to media

బాలీవుడ్​ నటి సారా అలీఖాన్ నటించిన అత్రంగి రే సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో ఈ సినిమా స్ట్రీమింగ్​ కానుంది. ఈ క్రమలోనే ప్రమోషన్స్​లో భాగంగా మీడియాతో మాట్లాడిన సారా.. టాలీవుడ్​ హీరో విజయ్​ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

దక్షిణాది స్టార్ హీరోల్లో ఎవ్వరితో స్క్రీన్​ షేర్​ చేసుకుంటారని అడగ్గా.. విజయ్​ దేవరకొండతో కలిసి నటించేందుకు రెడీ అని తెలిపింది సారా. విజయ్​ చాలా కూల్​ అండ్ హాట్​గా ఉంటాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా ఉన్న విజయ్​.. ఈ సినిమాతో బాలీవుడ్​లో అరంగేట్రం చేయనున్నారు. ఇందులో మైక్​టైసన్​ నటిస్తుండటం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version