https://oktelugu.com/

Anubhavinchu Raja: ఓటీటీలో ‘అనుభవించు రాజా’.. స్ట్రీమింగ్​ ఎప్పుడంటే?

Anubhavinchu Raja: ‘ఆహా’… తొలి తెలుగు ఓటీటీ సంస్థ. అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన ఈ సంస్థ ఓటీటీ రంగంలో తనదైన ముద్ర వేసింది. బ్లాక్​బస్టర్​ సినిమాలు, సరికొత్త వెబ్​సిరీస్​లు, టాక్​ షోలు, ఒరిజినల్స్​తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. రోజురోజుకీ సబ్​స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తాాజాగా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డానికి ఆహా లిస్టులో మ‌రో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చేరింది. రాజ్​తరుణ్​ హీరోగా నటించిన అనుభవించు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 07:35 PM IST
    Follow us on

    Anubhavinchu Raja: ‘ఆహా’… తొలి తెలుగు ఓటీటీ సంస్థ. అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన ఈ సంస్థ ఓటీటీ రంగంలో తనదైన ముద్ర వేసింది. బ్లాక్​బస్టర్​ సినిమాలు, సరికొత్త వెబ్​సిరీస్​లు, టాక్​ షోలు, ఒరిజినల్స్​తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. రోజురోజుకీ సబ్​స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

    తాాజాగా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డానికి ఆహా లిస్టులో మ‌రో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చేరింది. రాజ్​తరుణ్​ హీరోగా నటించిన అనుభవించు రాజా సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆహాలో డిసెంబరు 17న ప్రసారం కానుంది. శ్రీను గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్లగ‌డ్డ నిర్మించారు.

    ఇప్పటి వరకు రాజ్​తరుణ్ ఎప్పుడూ కనిపించని డిఫరెంట్ పాత్రలో ఇందులో దర్శనమిమచ్చారు. సిటీలో హడావిడి జీవితాన్న కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు. మరోవైపు పల్లెలో ఉండే ప్యూరిటీని కూడా చూపిస్తూ ఎంతో చక్కగా తెరకెక్కించారు దర్శకుడు. సుద‌ర్శ‌న్‌, ఆడుగ‌లం న‌ర‌రేశ్‌, అజ‌య్ త‌దిత‌రులు సినిమాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. న‌గేష్ బానెల్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ల‌స్ అయ్యింది.

    మరోవైపు అన్​స్టాపబుల్ షోతో దుసుకుపోతున్న ఆహా.. ఇదే జోరుతో త్రీ రోజెస్‌, వ‌న్‌, మంచిరోజులు వ‌చ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, సర్కార్‌ వంటి బ్లాక్​ బాస్టర్ చిత్రాలనూ 2021లో స్ట్రీమింగ్​ చేస్తూ.. అంతులేని ఎంటర్టైన్​మెంట్​ అందిస్తోంది.  ఇంకెందుకు ఆలస్యం ఆహాలోకి వెళ్లి వినోదాన్ని ఆస్వాదించండి.