https://oktelugu.com/

Nayanathara: 50 సెకండ్ల కోసం 5 కోట్లు డిమాండ్..అహంకారం తో రెచ్చిపోయిన నయనతార..మండిపడుతున్న అభిమానులు!

సౌత్ ఇండియా లో ఒక స్టార్ హీరోకి ఉన్నంత ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో నయనతార కచ్చితంగా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ట్రేడ్ ఈమెని లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తో పిలుస్తుంది. తమిళంలో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో చెరో రెండు మూడు సినిమాలు చేసిన ఈమె , తెలుగు లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి అనేక సినిమాల్లో నటించింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 15, 2025 / 08:18 PM IST
    Follow us on

    Nayanathara: సౌత్ ఇండియా లో ఒక స్టార్ హీరోకి ఉన్నంత ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో నయనతార కచ్చితంగా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ట్రేడ్ ఈమెని లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తో పిలుస్తుంది. తమిళంలో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో చెరో రెండు మూడు సినిమాలు చేసిన ఈమె , తెలుగు లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి అనేక సినిమాల్లో నటించింది. రీసెంట్ గానే ఈమె బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్’ చిత్రంలో నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా 1100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. ఆ విధంగా ఈమె సౌత్ లోనే కాకుండా, నార్త్ ఇండియా లో కూడా పాపులారిటీ ని సంపాదించుకుంది.

    ఈమె ఒక్కో సినిమాకి రెమ్యూనరేషన్ 10 నుండి 15 కోట్ల రూపాయిల వరకు తీసుకుంటుంది. భారీ బడ్జెట్ సినిమాలు అయితే ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుంది. రీసెంట్ గానే ఈమె టాటా స్కై సంస్థకి సంబంధించిన ఒక యాడ్ లో నటించింది. కేవలం 50 సెకండ్ల నిడివి ఉన్న ఈ యాడ్ కోసం నయనతార ఏకంగా 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఇంత మొత్తం లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోయిన్ కూడా రెమ్యూనరేషన్ ని అందుకోలేదు. కేవలం ఈ ఒక్క ప్రకటన కోసమే కాదు, ఆమె ప్రతీ ప్రకటనతోనూ ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె ఒక వ్యవహారం లో తలపొగరు చూపించి అభిమానుల చేత ఇంత అహంకారం అసలు పనికి రాదు అంటూ చివాట్లు అందుకుంది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవలే ఈము ఫెమీ 9 సానిటరీ నాప్ కిన్స్ అనే కంపెనీ ని మొదలు పెట్టింది. దీంతోపాటుగా ఈమె పలు బ్యూటీ కేర్, లిప్ కేర్ కంపెనీలను కూడా ప్రారంభించింది. ఇటీవలే ఈమె ఫెమీ 9 కంపెనీ కి సంబంధించి మధురైలో పని చేస్తున్న ఉద్యోగులతో ఒక కార్యక్రమం ని నిర్వహించింది. ముందుగా షెడ్యూల్ చేసుకున్న ప్రోగ్రాం ప్రకారం ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు మొదలు కావాల్సి ఉంటుంది. కానీ ఆమె ఏకంగా ఆరు గంటలు ఆలస్యంగా అక్కడికి చేరుకుంది. దీంతో ఉద్యోగులు ఎంతో ఇబ్బందికి గురయ్యారు. ఈ విషయం సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అవ్వడంతో నయనతార యాటిట్యూడ్ పై మండిపడ్డారు. ఆమె ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, ఆ పోస్ట్ క్రింద కామెంట్స్ లో ఉద్యోగులను ఇంతలా ఇబ్బంది పెట్టడానికి నీకు హక్కు ఎవరు ఇచ్చారు అంటూ నిలదీస్తున్నారు.