Sankranthiki Vasthunnam : ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన సెన్సేషన్ ఎలాంటిదో మనమంతా చూసాము. ప్రాంతీయ బాషా చిత్రాలకు సంబంధించిన వసూళ్లను కాదు, ఈ చిత్రం పలు ప్రాంతాల్లో ‘పుష్ప 2’, ‘కల్కి’ వంటి పాన్ ఇండియన్ సినిమాల రికార్డ్స్ ని కూడా బద్దలు కొడుతోంది. కానీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అయిన కొన్ని రికార్డ్స్ ని అందుకోవడంలో విఫలం అవుతూ ఉంటాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కూడా అలా విఫలమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మూడవ వారం లో ఈ చిత్రానికి 9 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్ళని రాబట్టి సంచలనం సృష్టించింది. 12 ఏళ్ళ క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి మూడవ వారంలో 8 కోట్ల 55 లక్షలు వచ్చాయి. ఆ రికార్డుని బద్దలు కొట్టింది ఈ చిత్రం.
కానీ 2023 వ సంవత్సరం లో ఇదే సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ రికార్డుని మాత్రం అందుకోలేకపోయింది. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి మూడవ వారంలో 9 కోట్ల 63 లేఖలు వచ్చాయి. తృటిలో ఆ రికార్డు మిస్ అయ్యింది. ఎంతైనా సోమవారం రోజున విడుదలైన సినిమాకి, వీకెండ్స్ లో విడుదలైన సినిమాకి ఆ మాత్రం తేడా ఉంటుంది. అందుకే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కాస్త వెనుకబడిందని అంటున్నారు విశ్లేషకులు. మూడవ వారం అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఇప్పటికీ ‘బాహుబలి 2’ చిత్రం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ సినిమాకి మూడవ వారంలో 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో 16 కోట్ల రూపాయిల షేర్ తో హనుమాన్ ఉండగా, మూడవ స్థానంలో 14 కోట్ల రూపాయిల షేర్ తో ‘పుష్ప 2’ చిత్రం ఉంది.
అదే విధంగా మూడవ వారం 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లతో దేవర చిత్రం నాల్గవ స్థానంలో ఉండగా, 12 కోట్ల రూపాయిల షేర్ తో #RRR చిత్రం 5వ స్థానంలో కొనసాగుతుంది. 6 , 7 స్థానాల్లో కల్కి, బాహుబలి చిత్రాలు చెరో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, 8 వ స్థానంలో ‘వాల్తేరు వీరయ్య’, 9వ స్థానంలో ‘అలా వైకుంఠపురంలో’, 10వ స్థానంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు వచ్చాయి. ఇక నాల్గవ వారంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. నాల్గవ వారంలో మొదటి రోజు (నిన్న) ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. అదే ఫ్లో ని కొనసాగిస్తే నాల్గవ వారంలో ఈ చిత్రం 5 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆడుతుంది అనేది.