Rekhachithram : మలయాళ సినిమా రేఖా చిత్రం (Rekhachithram) ఈ ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా సినిమా స్టోరీ అదిరిపోయింది. సినిమా మొదటి నుంచి ఎండ్ వరకు ట్విస్టుల మీద ట్విస్టులు.. అసలు చెప్పక్కర్లేదు. మలయాళ ఇండస్ట్రీ తొలి బ్లాక్ బస్టర్ (First Block Buster) మూవీగా నిలిచింది. థ్రిల్లర్ జోన్‌లో వచ్చిన సినిమా ప్రతీ ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతీ సీన్‌ను కూడా ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు. ఆసిఫ్ అలీ (Asif Ali) ఈ రేఖా చిత్రంలో హీరోగా నటించాడు. మలయాళ స్టార్ మమ్ముట్టి (Mammootty) క్యామియో రోల్‌లో ఇందులో కనిపించాడు. జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కేవలం మలయాళంలో మాత్రమే జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 5న రేఖా చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా తెలుగులో కూడా తీసుకురానున్నారు. ఇందులో ఆసిఫ్ అలీతో పాటు అనస్వర రాజన్, మనోజ్ కే జయన్, సిద్ధిఖీ, జగదీశ్, సాయికుమార్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్ కేవలం రూ.10 కోట్లతో మాత్రమే తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం 25 రోజ్లులోనే రూ.75 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికీ కూడా థియేటర్లలో రన్ అవుతుంది. అసలు ఊహకు అందని ట్విస్టులు ఉండటంతో ప్రతీ ఒక్కరికి ఈ సినిమా బాగా నచ్చేసింది.
రేఖా చిత్రం సినిమా మర్డర్ మిస్టరీ. ఈ కథలో ఒక ఆత్మహత్య కేసును సీఐ వివేక్ గోపీనాథ్ (ఆసిఫ్ అలీ) విచారిస్తాడు. అయితే ఇతను గ్యాంబ్లింగ్ స్కామ్‌లో దొరికిపోయి సస్పెండ్ అయి ఉంటాడు. కానీ ఈ కేసు ఛేదించడం కోసం మళ్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. 40 ఏళ్ల కిందట జరిగిన ఓ హత్య కేసుతో ఈ ఆత్మహత్యకు లింక్ ఉన్నట్లు ఆసిఫ్ అలీ గుర్తిస్తాడు. 1985 టైమ్‌లో ఓ సినిమా షూటింగ్ లొకేషన్‌లో ఓ బాలిక మిస్ అవుతుంది. ఆ బాలిక కేసు కూడా వివేక్ దర్యాప్తు చేస్తుంటాడు. ఇలా ఒక్కో సీన్‌కి ఒక్కో ట్విస్ట్ ఉంటుంది. అసలు ఆ కేసుకి, ఈ కేసుకి సంబంధం ఏంటి? చివరకు వివేక్ కేసును ఎలా చేధిసతాు ఫైనల్‌గా చిక్కుముడి లాంటి ఈ కేసులను ఆయన ఎలా ఛేదిస్తాడు, అసలు ఎలా దర్యాప్తు చేశాడనేది స్టోరీ. ఈ సినిమాలో ఒక్కొక్కరి యాక్టింగ్ పీక్స్‌లో ఉంటుంది. అసలు స్టోరీ స్క్రీన్ ప్లే, ఊహకు అసలు అందని ఆ ట్విస్టులు, ప్రతీ సన్నివేశం వావ్ అనిపించేలా డైరెక్టర్ తీశారు. కథ బాగుండమే ఏమో.. తక్కువ బడ్జెట్‌తో తీసినా కూడా కలెక్షన్లు బాగా రాబడుతోంది. మరి మీకు ఈ సినిమా స్టోరీ మొత్తం తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే.