Pooja Hegde : తక్కువ సినిమాలతోనే యూత్ ఆడియన్స్ లో ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే. ఇప్పుడంటే ఆమెకి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్ల ఐరన్ లెగ్ అనే ముద్రని వేసుకుంది కానీ, నాలుగేళ్ల క్రితం ఈమె పట్టిందల్లా బంగారం లాగా మారేది. ఒక్క పవన్ కళ్యాణ్ తో తప్ప అందరి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమెకి బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం గురించి. కమర్షియల్ గా ఈ సినిమా అప్పట్లో ఒక సునామీ. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా పూజా హెగ్డే కి కూడా బాగా కలిసొచ్చింది. ‘బుట్ట బొమ్మ’ పాట నేషనల్ లెవెల్లో హిట్ అయ్యింది బిలియన్ వ్యూస్ దక్కించుకోవడంతో ఈమెకు నార్త్ ఇండియా లో కూడా క్రేజ్ పెరిగింది.
ఫలితంగా ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు క్యూలు కట్టాయి. కానీ ఇప్పటి వరకు ఆమెకు బాలీవుడ్ లో ఒక్క కమర్షియల్ హిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. అంతే కాదు ఈ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్ళగానే కెరీర్ ని ఇచ్చిన టాలీవుడ్ ని మర్చిపోయింది. ఆమెకు మొదటి సినిమా అవకాశం ఇచ్చింది, మొట్టమొదటి హిట్ దక్కింది టాలీవుడ్ లోనే. అలాంటి టాలీవుడ్ ఇప్పుడు ఆమెకు గుర్తు లేదు. రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రం ‘దేవా’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్న ఆమె, పాన్ ఇండియన్ సినిమాలపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడిన ఈ మాటలపై మన టాలీవుడ్ ఆడియన్స్ ఏకిపారేస్తున్నారు.
ఇంతకు ఆమె అంతలా ఏమి కామెంట్ చేసిందంటే ‘అలా వైకుంఠపురం లో ఒక తమిళ చిత్రం. కానీ బాలీవుడ్ ఆడియన్స్ ఆ చిత్రాన్ని ఎగబడి చూసారు. అదే విధంగా దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని కూడా ఇలాగే చూసారు. సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు సినిమాలు చూస్తారు అనడానికి ఇదే ఉదాహరణ’ అంటూ చెప్పుకొచ్చింది. ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం ఎలా తమిళ సినిమా అయ్యింది?, నీకు కెరీర్ లో ఉన్న ఏకైక ఆల్ టైం ఇండస్ట్రీ హిట్, ఏ సినిమా వల్ల అయితే నీకు ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయో, ఆ సినిమా ఏ ఇండస్ట్రీ నుండి వచ్చిందో కూడా మర్చిపోయావా?, నటన రాని నిన్ను తెలుగు ఆడియన్స్ స్టార్ హీరోయిన్ ని చేసారు. వాళ్లకు నువ్వు ఇచ్చే విలువ ఇంతేనా అంటూ తెలుగు ప్రేక్షకులు పూజ హెగ్డే పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.