Sankranthi Telugu Movies 2026: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను బట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ సైతం పాన్ ఇండియాలో గొప్ప సినిమాలను రిలీజ్ చేస్తూ భారీ విజయాలను సాధిస్తున్నారు. సంక్రాంతి కి వస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు… ఇప్పటికే ప్రభాస్ హీరోగా చేసిన రాజాసాబ్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. దాంతో ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక 13వ తేదీన రవితేజ హీరోగా వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని బరిలోకి దిగుతుండడం విశేషం…ఇక 14వ తేదీన ‘నారీ నారీ నడుమ మురారి’, అనగనగా ఒక రాజు లాంటి సినిమాలు రావడం ప్రేక్షకుల్లో ఒకంత ఆనందాన్ని కలిగింపజేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ సినిమాలు సంక్రాంతికి రావడం వల్ల ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్ టైన్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
కానీ ఈ సినిమాలన్నింటిలో పాజిటివ్ టాక్ ఏ సినిమాకు వస్తుందో ఆ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. దానివల్ల సినిమా కలెక్షన్స్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రేక్షకులు సైతం ఎక్కువగా ఎంజాయ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే ‘మన శంకర వరప్రసాద్’ సినిమానే ఈ సంక్రాంతి విన్నర్ గా నిలువబోతోంది అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…
కారణం ఏంటి అంటే అందులో చిరంజీవి – వెంకటేష్ ఉండడమే కాకుండా ఎంటర్ టైన్ మెంట్ ను ఎక్కువ మోతాదులో అందించే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తుండటం విశేషం అంటూ చాలా మంది సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సంక్రాంతి విన్నర్ చిరంజీవి, వెంకటేష్ అవుతారా? లేదంటే వేరే హీరోలకు ఆ అవకాశం దక్కే ఛాన్సులు ఉన్నాయా? అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…