Sankranthi Releases 2026: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు సినిమాల మధ్య పోటీ తీవ్రతరమవుతుంది. ఈ సంక్రాంతికి సైతం చాలా సినిమాలు పోటీ పడుతుండటం విశేషం… ఇక ఈ సినిమాలన్నింటిలో ఏ మూవీ విజయాన్ని సాధిస్తోంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న ఒక స్టార్ హీరో మాత్రం ఈ సంక్రాంతి నాదే అంటూ చాలా గర్వంగా చెబుతుండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది… రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘రాజాసాబ్’ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దానికి తోడుగా ప్రభాస్ ఇప్పటివరకు చేయనటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది అనే ఒక భావనలో ప్రభాస్ ఐతే ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభాస్ తన సన్నిహిత వర్గాల దగ్గర ఈ సంక్రాంతికి మన సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడట.
మారుతి సైతం ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలో సైతం సినిమా తప్పకుండా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ తనతో పాటు సగటు ప్రేక్షకులను సైతం ఆనందింప చేస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కి మరొక రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ తన ఖాతాలో మరో సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది అతని అభిమానులను కలవరపెడుతోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మాత్రం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ప్రభాస్ వరుసగా మూడు విజయాలను సాధించిన హీరోగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంటాడు…