Sankranthi Movies 2026: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సినిమాల సందడి మొదలవుతుంది.ఇక జనవరి 9వ తేదీ నుంచి వరుసగా సంక్రాంతి హవా స్టార్ట్ అవ్వనుంది… ఈ సంక్రాంతికి తెలుగులో ఐదు సినిమాలు రిలీజ్ అవుతుండడం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆనందపరచే విషయమనే చెప్పాలి. ఈ ఐదు సినిమాలు సైతం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి ముస్తాబవుతున్నాయి… నిమాల నుంచి ఇప్పటికే ట్రైలర్లు అయితే రిలీజ్ అయ్యాయి. మరి ఈ ట్రైలర్లను బట్టి చూస్తే ఏ సినిమా ఎలాంటి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏ సినిమా ప్రేక్షకుడిని మెప్పించే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
రాజాసాబ్

ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ‘రాజాసాబ్’ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది… ఈ సినిమా హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కింది… ఇక ఇప్పటివరకు ప్రభాస్ ఇలాంటి సినిమా చేయకపోవడంతో డిఫరెంట్ పాత్రలో ప్రభాస్ ని మనం చూడబోతున్నాం అంటూ అతని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది… ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించడం, ఎప్పుడు లేనివిధంగా కామెడీ పంచులతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ట్రైలర్ను బట్టి చూస్తే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి…
మన శంకర వర ప్రసాద్

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్’ మూవీ ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఫ్యామిలీ నేపద్యంలో తెరకెక్కింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ లో చిరంజీవి కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే వెంకటేష్ కామెడీ సైతం ఈ సినిమాకి ప్లస్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది… ఫ్యామిలీ విత్ కామెడీని సబ్జెక్టులను సక్సెస్ ఫుల్ గా డీల్ చేయగలిగే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకి డైరెక్షన్ చేయడం కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక ఈ సినిమా సైతం పాజిటివ్ వైబ్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకైతే ఫ్యామిలీ ఆడియన్స్ అందరు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు చూద్దామా? అనే కుతూహలంతో ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…
భర్త మహాశయులకు విజ్ఞప్తి

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో దొరికేక్కిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సైతం ఈ నెల 13వ తేదీన ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ లో రవితేజ చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నాడు. అలాగే ఇటు భార్య, అటు లవర్ మధ్యలో నలిగిపోయే ఒక పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు… ఒక రకంగా చెప్పాలి అంటే ఇది కూడా ఫ్యామిలీ సినిమానే సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు… ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా ట్రైలర్ మీద ప్రేక్షకుల్లో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ సినిమాకి ఉండాల్సిన రేంజ్ లో ఈ ట్రైలర్ లేదని ఇలా అయితే కష్టమే అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు…
నారీ నారీ నడుమ మురారి

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ మూవీలో హీరో ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక వీళ్ళిద్దరిలో చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనే పాయింట్ తో తెరకెక్కింది… ఈ సినిమా టీజర్ ని బట్టి చూస్తే ఈ సినిమా సైతం పూర్తి ఎంటర్టైనర్ గా తెరకెక్కింది… శర్వానంద్ కి చాలా రోజుల నుంచి సక్సెస్ అయితే రావడం లేదు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యంతో మంచి కాన్సెప్ట్ ను ఎంచుకొని పండక్కి ప్రేక్షకులను ఆరించడానికి సిద్ధమవుతున్నాడు… ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో ఎలా నటిస్తాడు. ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ గా ఒక మంచి క్లైమాక్స్ ను డిజైన్ చేసి పెడితే మాత్రం సినిమా మంచి విజయాన్ని సాధిస్తోంది…
అనగనగా ఒక రాజు

నవీన్ పోలిశెట్టి కామెడీ సినిమాలను చేస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన హీరోగా చేస్తున్న ఈ సినిమా 14 వ తేదీన ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది. ఇక నవీన్ పోలిశెట్టి చాలా సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అతనితో పాటు ఇండస్ట్రీకి వచ్చిన హీరోలందరు వరుస పెట్టి సినిమాలను చేస్తుంటే అతను మాత్రం సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ఒక సినిమా మాత్రమే చేసుకుంటూ వస్తున్నాడు. ఇక గతంలో ఆయన చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో అనగనగా ఒక రాజు సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో అతను ఫుల్ జోవియల్ గా కామెడీ చేస్తూ ఉండే క్యారెక్టర్ లో కనిపించాడు. ఒక ఊరిలో ఉండే రాజుకు వ్యసనాలు ఉండి కోడిపందాలు, పేకాటలు ఆడి తన ఆస్తినంతా ఎలా పోగొట్టుకుంటున్నాడు అనేది ఒక కామెడీ వేలో చూపించినట్టుగా తెలుస్తోంది. సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ టీజర్ ఒకే అనిపించాయి. సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…