Sangeeth Shobhan Niharika Combo: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. యంగ్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సంగీత్ శోభన్ లాంటి హీరో సైతం ఇప్పుడిప్పుడే సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడానికి చూస్తున్నాడు. గత వారం రిలీజ్ అయిన రాకాస సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించిన ఆయన సోలో హీరోగా ఒక సక్సెసునైతే తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమాని నిహారిక కొణిదల నిర్మించడం విశేషం…
సంగీత్ శోభన్ నిహారిక ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండటంతో వీళ్ళిద్దరి మధు ఏదో ఉంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఇక రాకస మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వీళ్ళు చాలా యాక్టివ్ గా పాల్గొనడం అలాగే చాలా కలిసి మెలిసి ఉండడంతో ఇలాంటి వార్తలైతే వచ్చాయి. కొంతమందైతే వీరిద్దరి మధ్య ఏముంది అంటు కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఇక మరి కొంతమంది మాత్రం సంగీత్ ను చూస్తే మరో ఉదయ్ కిరణ్ లా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా సంగీత్ శోభన్ ఈ విషయం మీద స్పందిస్తూ ఇండస్ట్రీలో నాకున్న చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ లో నిహారిక కొణిదల ఒకరిని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
ఇక నిహారిక సైతం సంగీత్ తన సినిమాలో హీరో కాబట్టి తనతో అలా ప్రమోషన్స్ చేశానని అందువల్లే మా గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుతున్నారని ఆమె చెప్పారు. అలాగే సంగీత్ నా బెస్ట్ ఫ్రెండ్ అని కూడా ఆమె చెప్పడం విశేషం…ఇక వీళ్ళ కాంబోలో మరో సినిమా కూడా రాబోతుందనే వార్తలైతే వస్తున్నాయి… ఇక ఎట్టకేలకు వీళ్ళ మీద వస్తున్న వార్తలకు ఒక క్లారిటీ దొరికిందనే చెప్పాలి…