Raghavendra Rao – Niharika Konidela: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుల లిస్ట్ తీస్తే అందులో కె రాఘవేంద్ర రావు(K Raghavendra Rao) పేరు లేకుండా ఉండదు. ఎన్టీఆర్ కాలం నుండి నేటి తరం సూపర్ స్టార్స్ వరకు ఆయన దాదాపుగా అందరితోనూ సినిమాలు తీసాడు, భారీ కమర్షియల్ విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా రాఘవేంద్ర రావు ఒక హీరోయిన్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడంటే, ఆమె కచ్చితంగా ఇండస్ట్రీ లో టాప్ స్థానానికి చేరుకుంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అందుకు రీసెంట్ ఉదాహరణ శ్రీలీల నే. పెళ్లి సందడి చిత్రం ద్వారా ఈమెని టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. నేడు ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ, పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ముందుకు పోతోంది. అయితే రాఘవేంద్ర రావు గురించి ఇండస్ట్రీ లో కొన్ని రూమర్స్ ఎప్పటి నుండో ఉన్నాయి.
హీరోయిన్స్ తో కాస్త ఈయన అసభ్యంగా వ్యవహరిస్తాడని, ఆయన కొత్త హీరోయిన్స్ కి సినిమా అవకాశాలు అంత తేలికగా ఇవ్వడని ఒక చెడ్డ రూమర్ ఉంది. అందులో నిజానిజాలు ఎంత అనేది పక్కన పెడితే, రీసెంట్ గా ఒక ఈవెంట్ లో ఆయన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల(Niharika Konidela) నడుము మీద చేతులు వేయడం, ఆమె కాస్త అసౌకర్యానికి గురై రాఘవేంద్ర రావు గారి చెయ్యి ని నెట్టివేయడం, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నెటిజెన్స్ ఈ వీడియో ని షేర్ చేస్తూ ‘ముసలోడే..కానీ మహానుభావుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక అమ్మాయి అసౌకర్యం గా ఫీల్ అయ్యి చెయ్యి ని నెట్టివేస్తుంటే, వదలకుండా పట్టుకోవడం ఏంటి?, అంత పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి పరిస్థితే ఇలా ఉంటే, ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా అవకాశాల కోసం వచ్చే కొత్త ఆడవాళ్ళ పరిస్థితి ఏమిటి? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్.
అయితే మరికొంత మంది చెప్పేది ఏమిటంటే, చెడు దృష్టితో చూస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. ఆ వీడియో లో రాఘవేంద్ర రావు ఉద్దేశపూర్వకంగా అలా చేతులు వెయ్యలేదు. తన కూతురు తో సమానం అన్నట్టుగా ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నట్టు అనిపించింది. ఒకవేళ నిహారిక కి బ్యాడ్ టచ్ అనిపించి ఉండొచ్చేమో అని, అది రాఘవేంద్ర రావు కి తెలిసి ఉండకపోయి ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద వైరల్ టాపిక్ అవ్వడం తో, రాఘవేంద్ర రావు ఈ వీడియో పై స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. కచ్చితంగా ఆయన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
musalode kani mahanubhavudu pic.twitter.com/gWzhhyDfYy
— Mr. D ᴇ ᴠ ᴀ s ᴇ ɴ ᴀ (@RaashiSena) November 10, 2025