Adivi Sesh Interview Reaction: రీసెంట్ గా ప్రముఖ యంగ్ హీరో అడివి శేష్(Adivi Sesh) ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేపింది. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ఒక యంగ్ హీరో ని ఉద్దేశిస్తూ ‘నా నిర్మాతలు ఒక హీరో దగ్గరకు తీసుకెళ్లారు. అతను నన్ను చూడగానే, శేష్ నా లాగా నువ్వు ఎప్పుడు పెద్ద సినిమా తీస్తావు అని అన్నాడు. అతని కుళ్ళు బుద్ధిని చూసి నాకు చిరాకొచ్చింది. ఎవరి రేంజ్ కి తగ్గట్టు వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఇలా పోల్చి చూడాల్సిన అవసరం ఏంటి’ అంటూ చెప్పుకొచ్చాడు అడివి శేష్. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం, అడివి శేష్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు అంటూ పెద్ద ఎత్తున చర్చ సాగింది. కొంత మంది హీరో నిఖిల్ ని ఉద్దేశించి ఇలా మాట్లాడాడు అని అనగా, మరికొంతమంది మాత్రం తేజ సజ్జ, విజయ్ దేవరకొండ పేర్లు చెప్పారు.
అయితే ఒక కుర్ర హీరో మాత్రం ఇలా పరోక్షంగా అడివి శేష్ కామెంట్స్ చేయడం పై తీవ్ర స్థాయిలో మండిపడినట్టు తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ ‘ఇలా పరోక్షంగా మాట్లాడే బదులు, నేరుగా పేరు చెప్పి మాట్లాదోచు కదా, ఇలా నేను చెయ్యని తప్పుకి సోషల్ మీడియా లో అందరూ నన్ను ఉద్దేశించే కామెంట్స్ చేసాడని అంటున్నారు, ఇలా అతని తప్పు లేకుండా, ఇన్ని మాటలు తీసుకోగలడా?’ అని అసహనం వ్యక్తం చేసాడట. ఒకవేళ అడివి శేష్ మీకు ఫోన్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే శాంతిస్తారా అని అడగ్గా, అసలు అతని ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యను అని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టుతో మాట్లాడాడు అట ఆ యంగ్ హీరో. ఇంతకీ ఎవరు ఆ యంగ్ హీరో అనేది మాత్రం బయటకు రాలేదు.
చాలా మంది తేజ సజ్జ అని అంటున్నారు. ఎందుకంటే వరుస విజయాల్లో ఉంది ఆయనే, పాన్ ఇండియా లెవెల్ లో హిట్స్ కూడా కొట్టింది ఆయూయనే కాబట్టి. అందుకే తేజ సజ్జ ఇంతలా బాధపడాల్సి వచ్చింది. అయితే తేజ సజ్జ అలా మాట్లాడే రకం కాదు, అతని ఇంటర్వ్యూస్ ఇది వరకు చాలానే చూసాము, ఎప్పుడూ కూడా ఇలాంటి యాటిట్యూడ్ చూపించలేదు. ఇది కచ్చితంగా నిఖిల్ పనే అయ్యుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అడివి శేష్ కనీసం ఇప్పటికైనా ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో చెప్పేస్తే బాగుంటుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఆయన హీరో గా నటించిన ‘డెకాయిట్’ చిత్రం ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.