Hit 3
Hit 3 : ఒకపక్క హీరో గా మరోపక్క నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani). రీసెంట్ గానే ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్'(Court Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్ 3’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. మే 1 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై నితిన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు నాని. ఇది వరకు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాస్ చేస్తూ వచ్చిన నాని, ఈ సినిమా లో పూర్తి స్థాయి మాస్ క్యారక్టర్ తో మన ముందుకు రానున్నాడు.
Also Read : ‘హిట్ 3’ మూవీ చూడొద్దు… నాని స్టేట్మెంట్ కి అందరి మైండ్ బ్లాక్, మేటర్ ఏంటంటే?
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే హిట్ 3(Hit : The Third Case) లో నాని తో పాటు, మరో హీరో కూడా ఉంటాడట. ఆ హీరో మరెవరో కాదు, అడవి శేష్(Adivi Sesh). ‘హిట్ 2’ లో హీరో గా చేసింది ఈయనే అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆ పాత్రకు కొనసాగింపుగా ‘హిట్ 3’ లో కూడా ఆయన కొనసాగుతాడని తెలుస్తుంది. ఈ అంశాన్ని ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంచారు మేకర్స్. ఇది ఇలా ఉండగా ‘హిట్ 4’ లో హీరో గా నటించబోయేది ఎవరో కూడా క్లైమాక్స్ లో తెలియచేయబోతున్నారట మేకర్స్. హిట్ 4 చిత్రం మాస్ మహారాజ రవితేజ(Mass Maharaj Raviteja) తో కానీ, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తో కానీ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అదే కనుక నిజమైతే ఆ ఇద్దరి హీరోలలో ఎవరో ఒకరు క్లైమాక్స్ లో కనపడే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే ‘హిట్ 3’ లో హీరోయిన్ గా KGF సిరీస్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) నటించింది. రీసెంట్ గానే ఒక మెలోడీ సాంగ్ విడుదల కాగా దానికి అంతంత మాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. కానీ టీజర్ మాత్రం పెద్ద బ్లాస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి బ్లాస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా నుండి ఇంకొక్కటి వస్తే, ఓపెనింగ్స్ ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయి. ఈ నెల 18న థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ ఇలా వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మంచి ఊపు మీదున్న నాని, ఈ చిత్ర తో ఆ ఊపుని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తాడని ఆయన అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు. చూడాలి మరి ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుంది అనేది.
Also Read : ‘హిట్ 3’ టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్..24 గంటల్లో బీభత్సం..నాని ఇక స్టార్ హీరోల లీగ్ లోకి వచ్చినట్టే!