Sandeep Vanga Vishwak Sen: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు. ఇక స్టార్ట్ డైరెక్టర్లు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగినా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు చేసిన సినిమాలు అతనికి భారీ గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాయి. ప్రస్తుతం సందీప్ లాంటి స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కాబట్టి ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలావరకు ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ (Prabhas) లాంటి నటుడితో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ బ్యానర్ లో చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన కొంతమంది తన అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్లుగా మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు…రామ్ చరణ్ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయిందా..?
ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన కథతో ఒక సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. నిజానికి సందీప్ నుంచి వచ్చే కథ చాలా వైల్డ్ గా ఉంటుంది. దానిని సక్సెస్ ఫుల్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగే కెపాసిటీ దర్శకుడికి ఉండాలి. లేకపోతే మాత్రం కథ దర్శకుడిని డామినేట్ చేస్తే మాత్రం దర్శకుడు ఫెయిల్ అయిపోతాడు.
ఫైనల్ గా సినిమా కూడా ఫ్లాప్ ని మూటగట్టుకుంటుంది. అందుకే ఆయన కెపబులిటిని మ్యాచ్ చేయగలిగే దర్శకుడికి మాత్రమే ఆయన సినిమా చేసే అవకాశాన్ని కలిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈయమ రాసిన స్టోరీ చాలా రా అండ్ రాస్టిక్ గా ఉండటం తో ఈ సినిమాలో విశ్వక్ సేన్ ను హీరోగా తీసుకోవాలని అనుకుంటున్నారట…ఇక ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు వాళ్ళ కథలతో వాళ్ళ అసిస్టెంట్లను డైరెక్టర్లుగా పరిచయం చేస్తున్న సందర్భంలో సందీప్ రెడ్డి వంగా సైతం అలాంటి డిసిజన్ ను తీసుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: ప్యారడైజ్ లో నాని అన్నగా నటిస్తున్న స్టార్ హీరో…ఇది వేరే రేంజ్ లో ఉందిగా…
ఇక సందీప్ రెడ్డి వంగ ఇచ్చే కథ ఎలా ఉంటుంది దాన్ని ఆయా దర్శకులు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం సందీప్ స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వీలైనంత తొందరగా ఈ సినిమాను కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యం లో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది…