Nithiin Thammudu rejection: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాల్సిన నితిన్ (Nithin) కేవలం మీడియం రేంజ్ హీరోగానే ఉన్నాడు. తన తోటి హీరోలు అతన్ని బీట్ చేసి ముందుకు సాగుతూ స్టార్ హీరో రేంజ్ ను అందుకుంటుంటే ఆయన మాత్రం ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు. ఇక స్టార్ హీరోలు అందరు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ వాళ్ల స్టార్ డమ్ ను పెంచుకుంటున్నారు. కానీ నితిన్ మాత్రం ఇంకా ఇదే పొజిషన్లో ఉండడం అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే గత ఐదు సంవత్సరాల నుంచి ఆయనకు సిరియన్ సక్సెస్ అయితే దక్కడం లేదు. వరుసగా చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లు అవుతున్నాయి.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలేవి అతన్ని మెప్పించకపోగా భారీగా డ్యామేజ్ చేస్తూ రావడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా నితిన్ కి మాత్రం చాలా మంచి రెస్పెక్ట్ అయితే ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి నితిన్ లాంటి నటుడు కూడా ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటినా కూడా ఆయన సక్సెస్ ఫుల్ హీరోగా మాత్రం ఎదగలేకపోతున్నాడు.
Also Read: సందీప్ రెడ్డి వంగ కథ తో సినిమా చేయబోతున్న స్టార్ హీరో…
ఇక రీసెంట్ గా వచ్చిన తమ్ముడు (Thammudu) సినిమాతో మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దిల్ రాజు (Dil Raju) ప్రొడ్యూసర్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కథని ముందుగా వేణు శ్రీరామ్ నానికి విడిపించారట. నాని ఈ కథను రిజెక్ట్ చేయడంతో తేజా సజ్జా దగ్గరికి ఈ కథ వెళ్ళింది.
ఆయన కూడా ఈ సినిమా స్టోరీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సాయి ధరమ్ తేజ్ ను అప్రోచ్ అయ్యారు. ఆయన కొంచెం సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఆయన ఈ కథను రిజెక్ట్ చేశారట. మొత్తానికి అయితే ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన కథను నితిన్ కి వినిపించి ఆయన్ని ఒప్పించి దిల్ రాజు ఈ సినిమాను చేశాడు. ఫైనల్ గా ఈ సినిమా అనుకున్న రేంజ్ లో అయితే లేదు.
Also Read: సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు…రామ్ చరణ్ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయిందా..?
ఇక దిల్ రాజు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నితిన్ నువ్వు ఎందుకని పై స్టేజ్ కి వెళ్లలేకపోతున్నావు అంటూ అతని మీద కొన్ని కామెంట్లు అయితే చేశాడు. దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ ఇలాంటి డిజాస్టర్ సినిమాలను అందిస్తుంటే ఇంకా ఎలా ముందుకు సాగుతారు అంటు కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…