Sandeep Vanga : పాన్ ఇండియా లెవెల్ లో తెలుగోడి సత్తా చాటిన దర్శకులలో ఒకరు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga). డాక్టర్ గా కెరీర్ లో రాణిస్తున్న సమయంలోనే సినిమాల మీద అమితమైన ఆసక్తి తో అర్జున్ రెడ్డి ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా స్క్రిప్ట్ ని పట్టుకొని కెరీర్ ప్రారంభంలో ఎంతో మంది హీరోల వద్దకు, నిర్మాతల వద్దకు వెళ్ళాడు. కానీ ఎవ్వరూ కూడా సందీప్ రెడ్డి వంగ ని గుర్తించలేదు. దీంతో ఆయనే నిర్మాతగా మారి, భద్రకాళి ప్రొడక్షన్స్ అనే సంస్థ ని స్థాపించి అర్జున్ రెడ్డి చిత్రాన్ని చేసాడు. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం సాధారణమైనది కాదు. తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మటు ని మార్చేసిన చిత్రమిది. హిందీ లో ఇదే చిత్రాన్ని ‘కబీర్ సింగ్’ అనే పేరుతో రీమేక్ చేస్తే, బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఊగిపోయింది. ఇక ‘యానిమల్'(Animal Movie) తో ఆయన సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read : సందీప్ కిషన్, సందీప్ వంగ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? ఇలాంటి అదృష్టాన్ని ఎవరైనా వదులుకుంటారా!
ఇలా సినిమా సినిమాకి తన మార్కెట్ పరిధి ని పెచుకుంటూ సందీప్ వంగ ఎవ్వరికీ అందనంత రేంజ్ కి వెళ్ళిపోయాడు. అలాంటి సందీప్ వంగ చిరంజీవి(Megastar Chiranjeevi), పవన్ కళ్యాణ్(Dy CM Pawan Kalyan) లకు వీరాభిమాని అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఎన్నో వందల సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన పంచుకున్నాడు కూడా. అంత వీరాభిమాని అయినప్పుడు వాళ్ళిద్దరితో చెరో సినిమా చేయొచ్చు కదా అని అభిమానులు సోషల్ మీడియా లో ఎప్పటి నుండో రిక్వెస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల, ఆయనతో సినిమా చేయకపోవచ్చు కానీ, చిరంజీవి తో మాత్రం ఒక సినిమా ఖరారు అయ్యింది అనేది లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇటీవలే ఆయన మెగాస్టార్ ని కలిసి రెండు మూడు సార్లు స్టోరీ ని వినిపించాడట. చిరంజీవి కి ఆ స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే చేసేద్దాం అని అన్నాడట.
అయితే ప్రస్తుతం సందీప్ వంగ ప్రభాస్(Rebel Star Prabhas) తో ‘స్పిరిట్'(Spirit Movie) అనే చిత్రం చేయడానికి సిద్ధం గా ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో నిమగ్నమై ఉన్నాడు. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. చాలా రోజుల క్రితం చిరంజీవి స్పిరిట్ చిత్రం లో ఒక మంచి క్యారక్టర్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు సందీప్ వంగ, చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘స్పిరిట్’ యేనా?, లేకపోతే వేరే ప్రత్యేకమైన ప్రాజెక్ట్ చేస్తున్నారా అనేది క్లారిటీ రాలేదు. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క రికార్డు కూడా మిగలదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరో పదేళ్ల వరకు చెక్కు చెదరని రికార్డ్స్ ని ఈ చిత్రం నెలకొల్పుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉగాది లోపు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : యానిమల్ లో అందుకే రణ్ బీర్ ను బట్టలిప్పి నిలబెట్టించాను : సందీప్ వంగా