https://oktelugu.com/

Game Changer: ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్ ఆ రేంజ్ లో ఉండబోతుందా..? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ ట్విస్ట్!

ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో లీకై అవి అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఈ సినిమా మొదటి కాపీ ని కొంతమంది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ కి, మీడియా ప్రతినిధులకు స్పెషల్ షో వేసి చూపించారట.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 03:08 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer: #RRR వంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి ‘గేమ్ చేంజర్’ చిత్రం మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ‘వినయ విధేయ రామ’ చిత్రం తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సోలో హీరో చిత్రమిది. ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జనవరి 10వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి, పాటలకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వచ్చే వారం నుండి ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలు కానున్నాయి. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లండన్ లో మొదలయ్యాయి. నెల రోజులకు ముందే 6 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రేపటి నుండి నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి.

    ఇదంతా పక్కనే పెడితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో లీకై అవి అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఈ సినిమా మొదటి కాపీ ని కొంతమంది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ కి, మీడియా ప్రతినిధులకు స్పెషల్ షో వేసి చూపించారట. వాళ్ళ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ రామ్ చరణ్ కెరీర్ లోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లోనే పాత్ బ్రేకింగ్ గా నిలవబోతున్నాయట. క్లైమాక్స్ ట్విస్టులు అంటే మన తెలుగు సినిమా లో ఒక పోకిరి, ఒక రంగస్థలం చిత్రాలతో పోల్చి చూస్తారు. గడిచిన రెండు దశాబ్దాలలో ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేసిన క్లైమాక్స్ లు ఇవి. ఈ రెండు సినిమాల రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళడానికి కారణమయ్యాయి ఈ రెండు క్లైమాక్స్ లు.

    ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదలైన తర్వాత ఈ రెండు సినిమాల క్లైమాక్స్ లను పూర్తిగా మర్చిపోతామట. థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్ ట్రాన్స్ నుండి బయటకి రాలేమట. ఆ రేంజ్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లే క్లైమాక్స్ అని ఈ సినిమా ప్రివ్యూ ని చూసిన వాళ్ళు చెప్తున్నారట. వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ ని చూసి నిర్మాత దిల్ రాజు ఎంతో సంతోషంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు తన సర్వసాన్ని పెట్టేసాడు. ఈ చిత్రానికి ఆయన ఖర్చు చేసినంతగా, ఏ సినిమాకి చేయలేదు. కేవలం పాటలను చిత్రీకరించడం కోసమే ఆయనకీ వంద కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ఖర్చు అయ్యింది. ఇంత రిచ్ గా తీసి, సినిమా ఔట్పుట్ కూడా అదిరిపోవడంతో, కచ్చితంగా ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకుంటుంది అనే ధీమాతో ఉందట మూవీ టీం.