Spirit Movie Latest Updates: ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగ…ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత రన్బీర్ కపూర్ ను హీరోగా పెట్టి ఆయన చేసిన ‘అనిమల్’ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ లాంటి నటుడితో ప్రస్తుతం స్పిరిట్ అనే సినిమా చేస్తుండటం విశేషం…ఇక రీసెంట్ గా చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా షట్ స్టార్ట్ చేశారు. ఇక వీలైనంత తొందరగా ఈ సినిమాని రెగ్యూలర్ షూట్ కి తీసుకెళ్లి చాలా తక్కువ సమయంలోనే షూట్ ను పూర్తి చేయాలనే ఉద్దేశంలో సందీప్ రెడ్డి వంగ ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక సందీప్ రెడ్డి వంగ దగ్గర డైరెక్షన్ టీం లో పనిచేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు అలాగే మాస్ మహారాజా రవితేజ కొడుకు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రీసెంట్ గా డైరెక్షన్ టీం మొత్తం దిగిన ఫోటోలో వాళ్ళిద్దరూ ఉండడం విశేషం…
వాళ్ళిద్దరూ తన దగ్గర వర్క్ చేయాలనుకోవడానికి గల కారణం ఏంటి అంటే సందీప్ మేకింగ్ స్టైల్ చాలా కొత్తగా ఉంటుంది. అది ఈ తరం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. కాబట్టి అతని దగ్గర మెలుకులు నేర్చుకొని వాళ్లు కూడా ఫ్యూచర్లో డైరెక్షన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్ళతో పాటు వెంకటేష్ కొడుకు అయిన అర్జున్ కూడా సందీప్ రెడ్డి వంగ దగ్గర డైరెక్షన్ టీంలో వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
స్పిరిట్ మూవీ ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత అర్జున్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే వెంకటేష్ కొడుకు అర్జున్ కూడా సినిమా మేకింగ్ కి సంబంధించిన విషయాలన్నింటిని తెలుసుకున్న తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టే అతను సందీప్ ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న సెలబ్రిటీల కొడుకులందరు సందీప్ దగ్గరే డైరెక్షన్ టీమ్ లో వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ లెక్కన సందీప్ దగ్గర ఉన్న టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అందుకోసమే అందరిని ఆకర్షించిన ఆయన సెలబ్రిటీల కొడుకులను సైతం తన దగ్గరే పెట్టుకొని వాళ్ళకు వర్క్ నేర్పిస్తున్నారు అంటే మామూలు విషయం కాదు…