Bangladesh A Vs Pakistan A: ఆసియా కప్ రైసింగ్ స్టార్స్ టి20 టోర్నీ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. క్రికెట్ అభిమానులు ఊహించని ఆట తీరు ప్రదర్శించింది. తిరుగులేని పోరాటం చేసి పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించింది. అయితే చివర్లో అదృష్టం పాకిస్తాన్ జట్టును వరించడంతో బంగ్లాదేశ్ జట్టుకు దుఃఖం తప్పలేదు.. వాస్తవానికి చివర్లో గనుక బంగ్లాదేశ్ పోరాటాన్ని మరింత గొప్పగా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. బంగ్లాదేశ్ గతి ఇంకో రూపు దాల్చేది.
ఆదివారం దోహా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఏ, బంగ్లాదేశ్ ఏ జట్లు తలపడ్డాయి. రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరిగా జరిగింది. విజయం చివరికి పాకిస్తాన్ జట్టును వరించింది.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు చేసింది. మసూద్ 38, మిన్హాస్ 25, సదకత్ 23 పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో బంగ్లాదేశ్ బౌలర్లలో రిపన్ మోండల్ మూడు, రకీబుల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టారు. మొహరోబ్, జిషన్ అలాం, అబ్దుల్ గఫర్ సక్లైన్ తలా ఒక క్రికెట్ పడగొట్టారు.
అనంతరం బంగ్లాదేశ్ జట్టు టార్గెట్ ఫినిష్ చేసే క్రమంలో 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 రన్స్ చేసింది. సోహన్ 26, హసన్ 24 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. సుఫియన్ 3, అర్ఫత్ రెండు, ధనియాల్ రెండు వికెట్లు సాధించారు..
చివరి ఓవర్ లో బంగ్లాదేశ్ విజయానికి ఏడు పరుగులు చేయాల్సి ఉండగా.. ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ బౌలర్ అహ్మద్ దానియల్ కట్టుదిట్టంగా బంతులు వేశాడు. ఫలితంగా మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. సూపర్ ఓవర్ లో బంగ్లాదేశ్ 3 బంతులు మాత్రమే ఆడి ఆరు పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. సూపర్ ఓవర్ నిబంధన ప్రకారం రెండు వికెట్లు పడితే ఆల్ అవుట్ అయినట్టు లెక్క.. అయితే సూపర్ ఓవర్లో దనియల్ అద్భుతంగా బౌలింగ్ వేసి అదరగొట్టాడు.
బంగ్లాదేశ్ విధించిన ఏడుపరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 4 బంతుల్లోనే ఫినిష్ చేసింది. మరోసారి ఎమర్జింగ్ ఆసియా కప్ టైటిల్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ విజయంలో దనియల్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. సదకత్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. భారత ఏ జట్టుతో సెమి ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. అయితే పాకిస్తాన్ జట్టుతో మాత్రం అదే దూకుడు కొనసాగించలేకపోయింది.