Bollywood Heroes: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు ఒక్క సక్సెస్ సాధించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఒకప్పుడు ఖాన్ త్రయం నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచేది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్క సక్సెస్ కోసం విపరీతమైన ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక వాళ్ళు ఎవరి డైరెక్షన్లో నటించాలి. ఎవరితో సినిమాలు చేస్తే సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం మిగతా ఇండస్ట్రీ హీరోలతో పోలిస్తే బాలీవుడ్ హీరోల నుంచి వచ్చే సినిమాలకు భారీ రెస్పాన్స్ రావడం లేదు. షారుక్ ఖాన్ ఒక్కడే అడపాదపా సక్సెస్ లను సాధిస్తున్నాడు… గత రెండు సంవత్సరాలు క్రితం అట్లీ డైరెక్షన్ లో చేసిన ‘జవాన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు మరోసారి ‘కింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో కూడా ఆయన సక్సెస్ ని సాధిస్తే పర్లేదు. లేకపోతే మాత్రం షారుక్ ఖాన్ సైతం వెనుకబడి పోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక సల్మాన్ ఖాన్ నుంచి వచ్చే ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడం లేదు. అలాగే అమీర్ ఖాన్ అయితే అసలు సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపించడం లేదు…
రన్బీర్ కపూర్ ‘అనిమల్’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన కూడా స్టార్ హీరోల రేసును మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల పరిస్థితి చాలా దయనీయంగా ఉందనే చెప్పాలి… వీలైనంత తొందరగా వాళ్లు కోలుకొని మంచి సినిమాలను చేయకపోతే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాల దాటికి వాళ్ళ ఐడెంటిటి కూడా కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు.
ఇక ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు బాలీవుడ్ ప్రేక్షకులందరిని ఆకర్షిస్తున్నారు. ఖాన్ త్రయం అంటే అభిమానించే వాళ్ళు మన హీరోల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తుండటం విశేషం…ఇక ఫ్యూచర్ లో బాలీవుడ్ ఉనికిని నిలుపుకోవాలంటే మాత్రం రానున్న రెండు మూడు సంవత్సరాల్లో వల్ల సత్తా చాటుకోవాలి లేకపోతే వాళ్ళ అడ్రసు సైతం గల్లంతయ్యే అవకాశాలైతే ఉన్నాయి…