Sandeep Reddy Vanga Boyapati Srinu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి దర్శకుడిగా పరిచయమైన బోయపాటి శ్రీను(Boyapati Srinu)ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా మాస్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. బాలయ్య బాబుతో చేసిన సింహా, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఇప్పుడు బాలయ్య బాబుతో అఖండ 2 సినిమా చేస్తున్నాడు. అయితే బోయపాటి సినిమాలన్నీ ఒకే టెంప్లేట్ లో ఉంటాయని మాస్ ప్రేక్షకులను మాత్రమే ఆకర్షిస్తూ ఉంటాయని చాలామంది చెబుతూ ఉంటారు. అలాగే ఆయన సినిమాల్లో ఫైట్స్ హైలెట్ గా నిలుస్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా బాలయ్య బాబు హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి సందీప్ రెడ్డి వంగ గెస్ట్ గా వచ్చినప్పుడు బోయపాటి గురించి తన అభిప్రాయాన్ని చెప్పమని సందీప్ ని అడగగా బోయపాటి సినిమాలో బాగుంటాయి.
Also Read: కొరటాల శివకు ఏమైంది? ఎందుకు కనిపించడం లేదు..?
కానీ అన్ని సినిమా ఫైట్లు టెంపుల్ లోనే ఉంటాయి అంటూ నవ్వాడు. మొత్తానికైతే బోయపాటి ని కొంతవరకు కామెడీ చేశాడని ఆయన అభిమానులు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ చెప్పిన దాంట్లో తప్పేముంది. బోయపాటి సినిమాలోని అన్ని ఫైట్లు టెంపుల్ లోనే ఉంటాయి కదా అని మరి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు అయితే చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా బోయపాటి లాంటి దర్శకుడు మాస్ ఇమేజ్ ను సంపాదించుకోవడంలో చాలావరకు సక్సెస్ ని సాధించాడు. ఇక అల్లు అర్జున్ లాంటి హీరోకి సరైనోడు లాంటి సూపర్ సక్సెస్ ను కట్టబెట్టి ఆయనను స్టార్ హీరోగా మార్చాడు…ఇక ఇప్పుడు బాలయ్య బాబుతో చేస్తున్న అఖండ 2 సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ కి మరో భారీ షాక్..పాపం ఫ్యాన్స్
అఖండ సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. దానికి మించి ఈ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాబట్టి ఈ సినిమాను చూడడానికి బాలయ్య బాబు అభిమానులతో పాటు చాలామంది సినిమా ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండటం విశేషం…
https://youtube.com/shorts/bIl5-h5nIPU?si=ixsVHUu-r9cS_vyk