Director Koratala Siva: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కొరటాల శివ ఒకరు…ఒక మెసేజ్ ని కమర్షియల్ ఎలిమెంట్స్ కి జత కలిపి సినిమాలను చేసి సక్సెస్ లను సాధించడంలో కొరటాల శివ మొదటి స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…ఇక గత సంవత్సరం ‘దేవర’ (Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పటివరకు తన మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వలేదు. దేవర 2 సినిమా ఉంటుందంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చినప్పటికి దానికి సంబంధించిన ఈ విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా తెలియజేయడం లేదు. మరి దేవర 2 సినిమా ఉంటుందా? లేదంటే కొరటాల శివ మరొక హీరోతో వేరే సినిమా చేయబోతున్నాడా? అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. దాదాపు సంవత్సరం నుంచి కొరటాల శివ ఎక్కడ ఎవరికి కనిపించడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆయన అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయి స్క్రిప్ట్ లను రాసుకునే పనిలో ఉన్నాడా?
Also Read: తెలుగు vs తమిళ డైరెక్టర్స్ లో ఎవరిది పై చేయి..
లేదంటే దేవర సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు పాన్ ఇండియాలో గొప్ప సక్సెస్ లను సాధించారు…దేవర సినిమాతో కొరటాల శివ సైతం 500 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిపాడు.
మరి ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత దేవర 2 సినిమాని స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దాని కోసమే కొరటాల శివ తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించి మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: సుకుమార్ తన ఐక్యూ ను తగ్గించుకొని చేసిన సినిమాలు ఇవేనా..?
ఎన్టీఆర్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని దేవర సినిమాతో నిలబెట్టుకున్న కొరటాల శివ దేవర 2 సినిమాను అంతకు మించిన రేంజ్ లో సక్సెస్ చేసి, మరోసారి తన స్టామినా ఏంటో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులకు తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటికే ఇండియాలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ అయితే చేసుకున్నారు. కాబట్టి కొరటాల శివ కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైందనే చెప్పాలి…