Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘శివ ‘ సినిమా తర్వాత అలాంటి సినిమా మరొకటి రాదు అంటూ చాలామంది కామెంట్స్ అయితే చేశారు. ఇక 30 సంవత్సరాల తర్వాత అర్జున్ రెడ్డి రూపంలో శివ సినిమాని రీప్లేస్ చేసే సినిమా వచ్చింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడమే కాకుండా ‘సందీప్ రెడ్డి వంగ’ టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఇక అర్జున్ రెడ్డి సినిమా కూడా సందీప్ మేకింగ్ లో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిందనే చెప్పాలి. ఇక సందీప్ ఈ సినిమాని బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించినప్పటికీ ఈ సినిమాను చూసే ప్రేక్షకులకు మాత్రం బాగా కనెక్ట్ అయింది. అందుకే ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఒకటికి రెండుసార్లు చూసి మంచి విజయాన్ని అందించారు. ఇక సందీప్ వంగ డైరెక్టర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. గత సంవత్సరం రణ్బీర్ కపూర్ తో చేసిన ‘అనిమల్ ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా రన్బీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్ ‘ సినిమాని కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు సందీప్ రెడ్డివంగా ఎప్పుడు బోల్డ్ కంటెంట్ తోనే సినిమా చేస్తాడా? ఆయనకి నార్మల్ కంటెంట్ తో సినిమాలు చేయడం రాదా? అంటూ ఆయన మీద తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు. నిజానికి సందీప్ రెడ్డి వంగ కూడా అప్పుడప్పుడు జానర్ మార్చి ప్రేక్షకులకు బోల్డ్ కంటెంట్ కాకుండా నార్మల్ కంటెంట్ తో సినిమాలు చేసి మెప్పించగలిగితే అతనిలో ఉన్న టాలెంట్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది.
అలా కాకుండా బోల్డ్ కంటెంట్ నే నమ్ముకుంటు ముందుకెళ్తే మాత్రం ఆయన సినిమాలు ఒకానొక సందర్భంలో ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి తనను మార్చుకుంటూ ముందుకెళ్తే మంచిదని మరి కొంతమంది కూడా అతనికి సలహాలైతే ఇస్తున్నారు. మరి సందీప్ వంగ ఎవరి మాట వినడు కాబట్టి ఆయనకి ఆయన తెలుసుకొని మార్చి స్టార్ట్ డైరెక్టర్ గా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతాడా?
లేదంటే ఇలాగే బోల్డ్ కంటెంట్ తోనే సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాడా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. అర్జున్ రెడ్డి, అనిమల్ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. కాబట్టి ఆయన ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు…