Classical Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని సినిమా ఇండస్ట్రీలో ఎలాగైనా సరే రాణించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి మన స్టార్ హీరోలు మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొన్ని భాషల్లో క్లాసికల్ హిట్ గా మిగిలిపోయిన సినిమాలను రీమేక్ చేయాలని చాలా మంది చూస్తూ ఉంటారు. దానివల్ల చాలామందికి దెబ్బ పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక భాషలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాను మరొక భాషలో రీమేక్ చేయడం వల్ల ఆ మ్యాజిక్ అయితే క్రియేట్ అవ్వకపోవచ్చు. ఇక ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చిన చాలా క్లాసికల్ సినిమాల విషయం ఇదే జరిగింది. ఒకసారి సూపర్ హిట్ అయింది అంటే సినిమా రీమేక్ అవ్వకుండానే మనవాళ్లు అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు.
కాబట్టి ఆ సినిమాలను కూడా చూసేస్తున్నారు. మొత్తానికైతే త్రీ ఇడియట్స్, అర్జున్ రెడ్డి, 96 సినిమాల విషయంలో ఇదే జరిగింది. అందుకే క్లాసికల్ సినిమాలను రీమేక్ చేయడం కంటే డబ్ చేసుకొని రిలీజ్ చేస్తే మంచిదని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి సక్సెస్ దక్కితే దాన్ని మనం ఎలా క్యాష్ చేసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.
కానీ కొన్ని సినిమాల విషయంలో మాత్రం రీమేకులు చేయడం అనేది ఇటు ప్రొడ్యూసర్స్ కి అటు హీరోలకి భారీగా నష్టాన్ని మిగులుస్తుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం చాలా సినిమాలు రీమేక్ చేసే అవకాశాలు లేకుండా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇక మీదట సినిమాలను రీమేక్ చేసే అవకాశం లేకుండా పోతుంది. తద్వారా పాన్ ఇండియా సినిమాకి క్రేజ్ పెరగడమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు ఆ సినిమాలని చూస్తూ ఆదరిస్తూ వస్తున్నారు.
ఇలాంటి క్రమంలోనే తెలుగులో చాలామంది దర్శకులు తమదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం మన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కుతున్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండియాలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవల్లో దూసుకుపోతుంది… ఇక రాబోయే రోజుల్లో కూడా మన స్టార్ హీరోలు పాన్ ఇండియా వైడ్ గా భారీ సక్సెస్ లను అందుకోవడానికి రెడీ అవుతున్నారు. చూడాలి మరి ఫ్యూచర్ లో మనవాళ్ళు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది…