Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇక అందులో సందీప్ రెడ్డివంగ ఒకరు…ఆయన చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లి ఆయన ఆ తర్వాత చేసిన ‘అనిమల్’ సినిమాతో ప్రేక్షకులను మైమరింపజేసే సినిమాలను చేయడం తనకే సాధ్యం అంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
మరి ఇలాంటి క్రమంలోనే ఆయన భద్రకాళి పిక్చర్స్ పైన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఇక అదే బ్యానర్ లో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన వేణు అనే కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘మేము ఫేమస్’ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ‘సుమంత్ ప్రభాస్’ ను హీరోగా పెట్టి ఒక సినిమా అయితే చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
మరి ఈ సినిమా తొందరలోనే సెట్స్ మీదకి తీసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక సందీప్ రెడ్డివంగ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నప్పటికి తన మార్కు అయితే ఈ సినిమాలో కనిపిస్తుందని చాలామంది సినిమా మేధావులు చెబుతుండడం విశేషం…ఇక తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో సాగుతున్న కథ కావడం వల్ల ఈ సినిమా కథకి చాలా మంచి హైప్ అయితే క్రియేట్ అవుతోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట సందీప్ రెడ్డి వంగ చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో, తను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాల మీద కూడా అంతకుమించిన జాగ్రత్తలైతే తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ ని తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే అతను ఇంతకుముందు చేసిన సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే తెలంగాణ స్లాంగ్ చస ఈజ్ తో మాట్లాడగలిగే కెపాసిటి ఉన్న నటుడు కావడం వల్లే ఈ సబ్జెక్టు కూడా తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతోంది. కాబట్టే ఈ సినిమాకి తనను తీసుకున్నట్టుగా తెలుస్తోంది…