Peddi Movie Teaser: స్టార్ హీరోలకు సంబంధించిన ఫస్ట్ లుక్ , లేదా టీజర్ విడుదలైనప్పుడు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అభిమానుల కోలాహలం ఎలాగో ఉంటుంది, మరోపక్క దురాభిమానుల ట్రోలింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ముఖ్యంగా రామ్ చరణ్(Global Star Ram Charan) లాంటి మాస్ హీరో సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ఆరోజు మొత్తం కోలాహలమే. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా కాసేపటి క్రితమే ఆయన హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో రామ్ చరణ్ ని చూసి అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు. ఎలాంటి కంటెంట్ ని రామ్ చరణ్ ని చూడాలని కోరుకున్నామో, అలాంటి కంటెంట్ తోనే మా ముందుకు రాబోతున్నాడని, కచ్చితంగా ఈ చిత్రం తో రామ్ చరణ్ భారీ కం బ్యాక్ ని ఇచ్చి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కొల్లగొడుతాడని బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
Also Read: ‘పెద్ది’ టీజర్ వచ్చేసింది..ఫస్ట్ షాట్ సిక్సర్..లాస్ట్ షాట్ అరాచకం!
అయితే ఈ టీజర్ ని విమర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ టీజర్ ని చూసిన వెంటనే రంగస్థలం చిత్రం తాలూకు ఛాయలు ఉన్నాయని కొందరు, క్రికెట్ షాట్స్ ని చూసి నాని ‘దసరా’ మూవీ లాగా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేవలం ఒక్క షాట్ ని చూసి సినిమా అలా ఉంటుందని చెప్పడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ‘దసరా’ చిత్రం లో క్రికెట్ ఎపిసోడ్ కేవలం ఒక సందర్భం మాత్రమే. కానీ ‘పెద్ది’ చిత్రం పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న రూరల్ బ్యాక్ డ్రాప్ చిత్రం. కాబట్టి ఆ రెండు సినిమాలకు అసలు పోలికే లేదని, రెండు స్టోరీ లు వేరని అంటున్నారు.
పైగా ఈ చిత్రం లో రామ్ చరణ్ కేవలం క్రికెట్ ఆటగాడు మాత్రమే కాదు, కబడ్డీ,ఫుట్ బాల్, కుస్తీ ఇలా అన్ని ఆటల్లోనూ ఆరితేరిన నిష్ణాతుడు అన్నమాట. మట్టిలో మాణిక్యం లాగా మిగిలిపోయిన ఈ కుర్రాడి ప్రతిభ దేశం మొత్తానికి తెలుస్తుందా లేదా అనేది చూడాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఢిల్లీలో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కుస్తీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. AR రెహమాన్(AR Rahman) అందించే మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి హైలైట్ కానుంది. టీజర్ లోనే ఆయన విశ్వరూపం చూపించేసాడు. తమన్ డప్పులు, అనిరుద్ మ్యూజిక్ ని వినీవినీ బోర్ ఫీల్ అయినా ఆడియన్స్ కి AR రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాస్త కొత్తగా అనిపించింది.
