Sandeep Reddy Vanga on Spirit: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అన్నీ ప్రాంతాల్లో మొదలయ్యాయి. కానీ తెలంగాణ లో ఇంకా ప్రారంభం అవ్వలేదు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. అభిమానులు బుక్ మై షో, మరియు డిస్ట్రిక్ట్ యాప్స్ ని ముందు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. అది కాసేపు పక్కన పెడితే, ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇప్పటికే మూవీ టీం అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అయితే కాసేపటి క్రితమే సందీప్ రెడ్డి వంగ తో ప్రభాస్ మరియు ఈ చిత్రం లో నటించిన ముగ్గురు హీరోయిన్స్ కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ విశేషాలను ఒకసారి చూద్దాం.
బాహుబలి తర్వాత వరుసగా యాక్షన్ సినిమాలు చేసి బాగా బోర్ కొట్టేసింది. నా తెలుగు ఆడియన్స్ నా నుండి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. అలాంటి ఎంటర్టైన్మెంట్ జానర్ ఉన్న సినిమా చేసి నేను 15 ఏళ్ళు అయ్యింది. డార్లింగ్ లాంటి ఫన్నీ సినిమా చెయ్యాలని అనిపించిందని డైరెక్టర్ మారుతీ కి చెప్తే, ఆయన రాజా సాబ్ కథని రెడీ చేసి తీసుకొచ్చాడని ప్రభాస్ ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. సందీప్ వంగ హీరోయిన్స్ తో మాట్లాడుతూ ‘ప్రభాస్ కి అమ్మాయిలంటే సిగ్గు కదా, మరి మీతో ఎలా మ్యానేజ్ చేసాడు’ అని అడగ్గా, దానికి వాళ్ళు సమాధానం చెప్తూ ‘మొదటి వారం రోజులు ప్రభాస్ అసలు మాతో మాట్లాడలేదు, ఆ తర్వాత మేము కాస్త ఆయనకు అలవాటు పడిన తర్వాత అంతా సరదాగా సాగిపోయింది, షూటింగ్ ని మేమంతా బాగా ఎంజాయ్ చేసి చేసాము’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక స్పిరిట్ ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుతూ ‘నా కెరీర్ లో ది బెస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే. సందీప్ కి నన్ను అలా చూపించాలనే ఆలోచన ఎలా వచ్చిందో కానీ, అదిరిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఇక సందీప్ అందుకు సమాధానం ఇస్తూ ‘బాహుబలి తర్వాత ప్రభాస్ ని కొత్తగా చూపించాలి, ఎలా అని ఆలోచన వచ్చినప్పుడు , ఈ విధంగా చూపించాలని అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ‘నా సినిమాలకు నా పిల్లల్ని తీసుకొని వెళ్ళలేను, కానీ కచ్చితంగా ‘రాజా సాబ్’ కి మాత్రం తీసుకొని వెళ్ళగలను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే సందీప్ సినిమాలన్నీ A సర్టిఫికెట్ కాబట్టి, పిల్లల్ని థియేటర్స్ లో అనుమతించరు కాబట్టి , సందీప్ ఇలా చెప్పుకొచ్చాడు. ఈ పూర్తి ఇంటర్వ్యూ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
