Sandeep Reddy Vanga: యానిమల్ డైరెక్టర్ కి అవార్డు, దాని వెనుక ఆర్జీవీ హస్తం, ఇంట్రెస్టింగ్ స్టోరీ

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రానికి గాను ఐఫా( IIFA )అవార్డు అందుకున్నారు. ఎడిటింగ్ విభాగంలో ఈ అవార్డు ఆయన్ని వరించింది. అయితే ఈ అవార్డు దక్కడానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరోక్షంగా కారణమయ్యాడంటూ.. సందీప్ రెడ్డి వంగ ఆసక్తికర విషయం బయటపెట్టాడు.

Written By: S Reddy, Updated On : October 1, 2024 9:47 am

Sandeep Reddy Vanga(1)

Follow us on

Sandeep Reddy Vanga: అబూ దుబాయ్ వేదికగా 24వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(IIFA) వేడుక సెప్టెంబర్ 28న ఘనంగా జరిగింది. జవాన్ చిత్రానికి గాను షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. రాణి ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు దక్కింది. యానిమల్ మూవీ పలు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా అనిల్ కపూర్ ఎంపిక అయ్యారు. ఉత్తమ విలన్ విభాగంలో యానిమల్ చిత్రంలో నటనకు బాబీ డియోల్ అవార్డు అదనుకున్నారు.

బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాల్లో సైతం యానిమల్ అవార్డులు అందుకుంది. యానిమల్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ ఎడిటర్ గా కూడా పని చేశాడు. ఎడిటింగ్ విభాగంలో ఐఫా అవార్డు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడానికి పరోక్షంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కారణం, అన్నట్లు ఆయన మాట్లాడారు.

నాకు ఎడిటింగ్ లో అవార్డు వస్తుందని అసలు ఊహించలేదు. నేను రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను, అన్నారు. సందీప్ రెడ్డి వంగ కామెంట్స్ కి ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను ఇప్పుడు మీ నుండి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను, అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దేశం మెచ్చిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఆయన డెబ్యూ మూవీ శివ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్. ఫిల్మ్ మేకింగ్ లో కొత్త విధానం పరిచయం చేశాడు. అనంతరం బాలీవుడ్ కి వెళ్లి సత్య, రంగీలా, సర్కార్ వంటి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ స్ఫూర్తితో దర్శకులైన వారు ఎందరో ఉన్నారు.

కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ వంటి స్టార్ డైరెక్టర్స్ ఆయన వద్ద సహాయకులుగా పనిచేశారు. ఇక యానిమల్ మూవీపై అనేక విమర్శలు వినిపించాయి. పలువురు నటులు సైతం యానిమల్ ని ఒక చెత్త సినిమా అని అభివర్ణించారు. యానిమల్ కంటెంట్, సన్నివేశాల పై పార్లమెంట్ లో ఓ మహిళా ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ యానిమల్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు.

రన్బీర్ కపూర్-రష్మిక మందాన జంటగా నటించిన యానిమల్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక రోల్స్ చేశారు. తండ్రిని పిచ్చిగా ప్రేమించే కొడుకు పాత్రలో రన్బీర్ కపూర్ అద్భుతంగా నటించాడు. ఇక సందీప్ రెడ్డి వంగకు వరుసగా ఇది మూడో హిట్. ఆయన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాయి.

నెక్స్ట్ ఆయన ప్రభాస్ హీరోగా స్పిరిట్ తెరకెక్కించనున్నారు. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా స్పిరిట్ ఉంటుంది.