https://oktelugu.com/

NTR: ప్లాప్ డైరెక్టర్లకు సక్సెస్ లను అందించే ఏకైక టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు ఉన్నప్పటికి సక్సెస్ ఫుల్ హీరోలు మాత్రం కొందరే ఉన్నారు...ఇక ఇదిలా ఉంటే మరికొంత మంది మాత్రం సక్సెస్, ఫెయిల్యూర్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 1, 2024 / 09:53 AM IST

    NTR(2)

    Follow us on

    NTR: ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ఆయనకి మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసి పెట్టడమే కాకుండా తనలోని వైవిధ్యమైన నటనను కూడా బయటకు తీస్తుంది. ఇక ఇండియా లో ఉన్న టాప్ మోస్ట్ నటులలో తను కూడా ఒకడి గా గుర్తింపు వచ్చేలా మార్చుకున్నాడు. ఇక ఒకానొక సమయంలో ఆయనకు భారీ ప్లాప్ లు రావడంతో జూనియర్ ఎన్టీయార్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా వరుస సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యి వరుస సక్సెస్ లను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన ఫెయిల్యూర్ డైరెక్టర్లకు సక్సెస్ లను అందించే హీరోగా మారడం అనేది ఇప్పుడు ప్రేక్షకులందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక 2014వ సంవత్సరంలో టెంపర్ సినిమాతో సక్సెస్ ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాతో పూరి జగన్నాథ్ కి కూడా సూపర్ సక్సెస్ ని అందించాడు. ఇక అంతకు ముందు వరకు వరుస ప్లాప్ లు అయితే వచ్చాయి. కానీ టెంపర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు…

    ఇక ఆ తర్వాత బాబీ డైరెక్షన్ లో చేసిన ‘జై లవకుశ’ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకి ముందు బాబీ కి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాతో భారీ ఫ్లాప్ అయితే వచ్చింది. కానీ తను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. దానివల్ల ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి…

    ఇక ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో భారీ ప్లాప్ ను మూట గట్టుకున్న సుకుమార్ సైతం జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు…ఇక ఆ తర్వాత చేసిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా మారడమే కాకుండా సుకుమార్ ని స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేర్చింది…

    ఇక ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన దేవర సినిమాతో కొరటాల కి ఒక మంచి సక్సెస్ ను అయితే అందించాడు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. అయినప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు సినిమా అవకాశం ఇచ్చి ఆయనను కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా నిలిపాడు. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లడమే కాకుండా ఫెయిల్యూర్ దర్శకుల పట్ల కూడా ఆయన సక్సెస్ ఫుల్ హీరోగా మారిపోతున్నాడు.