Sandeep Reddy Vanga Early Career Story: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూస ధోరణిలో సినిమాలు చేస్తున్న క్రమంలో డిఫరెంట్ సినిమాలను చేస్తే బాగుంటుందని బోల్డ్ సినిమాలతో సైతం భారీ విజయాలను సాధించొచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం. ఇక అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. దాంతో రన్బీర్ కపూర్ ను హీరోగా పెట్టి చేసిన అనిమల్ సినిమా అతనికి గొప్ప గుర్తింపుని తీసుకొచ్చింది…
Also Read: పవర్ హౌస్‌గా కరీంనగర్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర..
మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి తీసుకొస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… సందీప్ రెడ్డివంగా కెరియర్ స్టార్టింగ్ లో పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ga పని చేయడానికి చాలా వరకు ప్రయత్నించారట.
కానీ పూరి జగన్నాథ్ దగ్గర ఖాళీ లేకపోవడంతో ఒకసారి పూరి ని కలిసి అతనితో మాట్లాడాడట. ఇక సందీప్ నాలెడ్జ్ తెలుసుకున్న పూరి జగన్నాథ్ నువ్వు ఎవరి దగ్గర పని చేయాల్సిన పనిలేదు. డైరెక్టుగా డైరెక్షన్ చేసేసుకోవచ్చు అంటూ సందీప్ ని ఎంకరేజ్ చేశాడట. దాంతో సందీప్ డైరెక్ట్ గా సినిమా చేసేశాడు.
మొత్తానికైతే సందీప్ డైరెక్టర్ గా మారడానికి పూరి జగన్నాథ్ కూడా చాలా వరకు హెల్ప్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో ఈ విషయం మీద చాలామంది మాట్లాడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచే దర్శకుడిగా మారాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
