Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది. వాళ్ల నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా సంపాదించి పెడుతుంటాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఆయన తీసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి ఇండియాలో ఏ దర్శకుడికి దక్కని గుర్తింపు అతనికి దక్కిందనే చెప్పాలి. మొదటినుంచి కూడా సందీప్ రెడ్డి వంగ వైఖరి మీద బాలీవుడ్ సెలబ్రిటీలు కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సందీప్ రెడ్డివంగ చేసిన తప్పేమీ లేదు. ఈయన సినిమాలను చూసి కొంతమంది సెలబ్రిటీలు నెగిటివ్ గా స్పందించినప్పుడు ఆయన దానికి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తూ ఉంటాడు. దానివల్ల ఆయన చాలా కోపస్తుడు అంటూ అతని మీద ఒక ముద్రను వేసి అతని సినిమాలను బాలీవుడ్ లో చూడకూడదు అని కొంతమంది బాలీవుడ్ మాఫియా వ్యక్తులు చాలా ప్రయత్నాలు చేశారు. అయిన కూడా ఆయన సినిమా కంటెంట్ లో దమ్ముంది కాబట్టి ఆ సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న బాలీవుడ్ ఒక రకంగా అతనికి మైనస్ చేయాలని చూస్తున్నారు. ఇక ఇప్పుడు స్పిరిట్ (Spirit) సినిమా విషయంలో దీపిక పదుకొనే (Deepika Padukone), సందీప్ రెడ్డివంగ (Sundeep Reddy Vanga) మధ్య ఒక చిన్న యుద్ధ వాతావరణం నడుస్తుందనే చెప్పాలి.
Also Read : సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కాంబో లో రావాల్సిన సినిమా ఉంటుందా..?
ఈ విషయాన్ని సైతం బాలీవుడ్ సినిమా పెద్దలు చాలా పర్సనల్ గా తీసుకొని ఈ విషయం మీద సందీప్ రెడ్డి వంగని ఎలాగైనా సరే కలవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి సందీప్ రెడ్డి వంగకి బాలీవుడ్ వాళ్లకి ఎందుకు పడడం లేదు. బాలీవుడ్ హీరోలు ఆయన పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నప్పటికి, క్యారెక్టర్ ఆర్టిస్టులు గాని, దర్శకులు గానీ ప్రొడ్యూసర్స్ గాని ఆయన పట్ల తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
కారణం ఏదైనా కూడా దర్శకుడు వచ్చి బాలీవుడ్లో పాగా వేసి భారీ సక్సెస్ ను సాధించడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ మరి కొంతమంది తెలుగు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా సందీప్ తన మొండి వైఖరితో ముందుకు సాగుతున్నాడు.
ఆయన చేయాలనుకుంది చేసి తీరుతాడు దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే వాళ్లకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ముందుకు సాగుతూ ఉండడం ఆయన నైజం అని మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం సందీప్ రెడ్డి వంగ పక్షాన నిలబడి అతనికి సపోర్ట్ చేస్తూ ఉండడం విశేషం…