NTR – Prashanth Neel : ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) డ్రాగన్ (Dragon) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలుగా నిలవడంతో పాన్ ఇండియాలో అతనికి గొప్ప గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఆ మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ అతనితో సినిమా చేస్తున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద ఇండియా వైడ్ గా మంచి బజ్ అయితే ఉంది. ఇక అదే క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలుపుతారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14వ తేదీన వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనేది రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ ద్వారా ప్రేక్షకులకు అర్థమైపోయింది.
మరి ఈ సినిమా ఎంతవరకు ఎన్టీఆర్ కు మంచి గుర్తింపును తీసుకొస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక హృతిక్ రోషన్ తో కలిసి పోటాపోటీగా నటిస్తున్న ఆయన ఈ సినిమా ద్వారా ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకుంటాడు. తద్వారా పాన్ ఇండియా మార్కెట్లో ఒక సపరేట్ ఐడెంటిటి సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : ఎన్టీఆర్ బర్త్ డే కి ప్రశాంత్ నీల్ సినిమా నుంచి గ్లింప్స్ వస్తుందా..?
గత సంవత్సరం వచ్చిన దేవర (Devara) సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేక పోయిన ఆయన ఇప్పుడు ఈ సినిమాలతో భారీ విజయాలను సాధించి తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఏకంగా ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందంటూ ఆయనతో పాటు సినిమా యూనిట్ కూడా మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు.
ఎన్టీఆర్ సైతం ఇదే నమ్మకంతో ముందుకు సాగుతున్నాడట. ఇప్పటివరకు చిత్రీకరించిన షూట్ అద్భుతంగా వచ్చిందని ఇక ఎన్టీఆర్ మీద భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాని సైతం ఇండస్ట్రీ హిట్ గా నిలవాలనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తోంది…