Kabeer Sing and Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ (సందీప్ Reddy Vanga) లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయనకు వచ్చిన గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మూస ధోరణిలో ముందుకు సాగుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా మార్చేసి కొత్త పుంతలు తొక్కించిన ఘనత కూడా అతనికే దక్కుతుంది. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తర్వాత అలాంటి ఘనతను సాధించిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల మీద యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరూ భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తను బాలీవుడ్ లో చేసిన ‘కబీర్ సింగ్’ (Kabeer Sing) సినిమాలో ఒక చిన్న నటుడు ఒక క్యారెక్టర్ లో నటించాడట. ఆయన ఎవరు అనేది చెప్పలేదు కానీ ఆ నటుడు వేరొక సినిమా ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు మీరు ఏ సినిమా చేశారు అని వాళ్ళు అడిగగా, ఆయన నేను సందీప్ రెడ్డి వంగ చేసిన కబీర్ సింగ్ సినిమాలో చేశానని చెప్పాడట. ఆ సినిమాలో చేస్తే మీరు మా సినిమాలో చేయడానికి పనికి రారు అంటూ ఆ నటుడుని అవమానించి బయటికి పంపించారట…ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు ఆ నటుడు సందీప్ రెడ్డివంగ ను కలిసాడట…దాంతో అతనికి ఆ ఆఫీస్ లో జరిగిన అవమానం గురించి చెప్పాడట…అది విన్న సందీప్ కోపానికి వచ్చాడట…అంటే నాతో సినిమాలు చేసిన వారు వేరే సినిమాలు చేయడానికి పనికి రారా అని తనలో తానే అనుకున్నాడట… ఇక ఎవరైతే నటుడు అవమానానికి గురి అయ్యాడో ఆ నటుడుని సందీప్ తన పక్కన కూర్చో బెట్టుకొని నాతో సినిమా చేసినందుకు నిన్ను వాళ్ల మూవీకి సెలెక్ట్ చేయలేదు కదా మరి నేనిప్పుడు రణబీర్ కపూర్ తో అనిమల్ (Animal) అనే సినిమా చేస్తున్నాను…
Also Read : యానిమల్ లో అందుకే రణ్ బీర్ ను బట్టలిప్పి నిలబెట్టించాను : సందీప్ వంగా
నాతో వర్క్ చేసినందుకు ఇక మీద రణబీర్ కపూర్ ను కూడా సినిమాల్లోకి తీసుకోరా? ఆయన్ని కూడా బ్యాన్ చేస్తారా? నాతో సినిమాలు చేసిన వాళ్ళకి ఇండస్ట్రీ లో అవకాశాలు ఇవ్వరా అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారట…ఇక ఇదంతా అనిమల్ సినిమా సెట్స్ మీద ఉన్న సమయం లో జరిగిన సంఘటన…ఇక ఆ తర్వాత అనిమల్ మూవీ రిలీజ్ అయి ఆయన ఇండియాలోనే స్టార్ డైరెక్టర్ గా అవతరించాడు…అయితే బాలీవుడ్ లో కొందరు కావాలనే సందీప్ సినిమాలో చేసిన నటులను వాళ్ల సినిమాల్లో తీసుకోవడం లేదట. అందుకే ఆయన ఆ నటుడి విషయంలో అలా రియాక్ట్ అయ్యాడట…
ఇక బాలీవుడ్ ప్రెస్ మీట్ లో సైతం ఇంతకు ముందు చాలాసార్లు సందీప్ ను తక్కువ చేసే విధంగా కొంతమంది కావాలనే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగేవారు. కానీ ఆయన ఒకసారి రిపోర్టర్లకి గట్టి కౌంటర్ ఇవ్వడంతో, ఇప్పుడు ఆయనను ఒక క్వశ్చన్ అడగడానికి రిపోర్టర్లు ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అతన్ని క్వశ్చన్స్ అయితే అడగుతున్నారట. ఏదైనా మిస్టేక్ జరిగితే ఆయన పబ్లిక్ గానే ఫైర్ అవుతూ భారీ కౌంటర్లు అయితే ఇస్తూ ఉంటాడు. అందుకే అందరూ అతనికి భయపడుతూ ఉంటారు…
ఆయన లాంటి డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం చాలా కష్టమని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఆయన ఆటిట్యూడ్ అందరికి నచ్చుతుంది. అందువల్లే ఆయన సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను దక్కించుకుంటూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమాతో నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కోసం ఆ స్టోరీ ని రెడీ చేశారా..? కథ మామూలుగా లేదుగా…