Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga And Aditya Dhar: సందీప్ రెడ్డి వంగ, ఆదిత్య ధర్ అందరు...

Sandeep Reddy Vanga And Aditya Dhar: సందీప్ రెడ్డి వంగ, ఆదిత్య ధర్ అందరు ఆ దర్శకుడి శిష్యులే…ఇంకా ఎంత మంది ఉన్నారు సామి…

Sandeep Reddy Vanga And Aditya Dhar: సినిమా ఇండస్ట్రీకి రావడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇక్కడ సక్సెస్ లను సాధిస్తారు. కారణమేంటి అంటే వాళ్ళు చేయబోయే సినిమాల విషయంలో సరైన క్లారిటీని మెయింటైన్ చేసిన వారు మాత్రమే ఇండస్ట్రిలో ఎక్కువ రోజుల పాటు గుర్తింపును సంపాదించుకుంటారు. నిజానికి వాళ్లు సినిమా ఇండస్ట్రీకి రావడానికి కూడా ఎవరో ఒకరు కారణమవుతారు. వారిని గురువుగా భావించి ఏకలవ్య శిష్యుడిలా చాలామంది చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘సందీప్ రెడ్డి వంగ’ దగ్గర నుంచి దురంధర్ 2 సినిమా దర్శకుడు ఆయన ‘ఆదిత్య ధర్’ వరకు చాలామంది అభిమానించేది ఒకే ఒక దర్శకుడుని అనే విషయం మనలో చాలామందికి తెలియదు.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

ఆయన ఎవరంటే శివ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ కావడం విశేషం… రాంగోపాల్ వర్మ చేసిన శివ, సత్య, సర్కార్, కంపెనీ లాంటి సినిమాలను చూసి మేకింగ్ గురించి నేర్చుకున్నానని అతని సినిమాలను చూడడం వల్ల నాలెడ్జ్ పెంచుకున్నానని చెప్పాడు.

దురంధర్ సినిమా ను వర్మ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా తీశానని చెప్పాడు. ఇక దురంధర్ 2 సినిమాను రిలీజ్ కి ముందు రామ్ గోపాల్ వర్మ చూసి దర్శకుడు మీద ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తానికైతే వర్మ దగ్గర వర్క్ చేసిన శిష్యులే కాకుండా ఏకలవ్య శిష్యులు సైతం వండర్స్ ని క్రియేట్ చేస్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ఇప్పటివరకు వర్మ చాలామందికి ఇన్స్పిరేషన్ గా మారాడు. ఆయన చెప్పిన మాటలు ఆయన చేసిన సినిమాలు ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీ వరకు తీసుకురావడంలో సక్సెస్ సాధించాయి. ఇక ఇలాంటి క్రమంలోనే వర్మ సైతం పిచ్చి సినిమాలు కాకుండా మంచి సినిమాలు చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు అభిప్రాయ పడుతున్నారు. తన శిష్యులే కాకుండా తను కూడా ఒక మంచి సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Christopher Nolan

Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా…

Christopher Nolan: క్రిస్టోఫర్ నోలన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రముఖ దర్శకుడిగా తనదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన 'ది ఒడిస్సీ'...
Dhanush

Dhanush: విజయ్ సీఎం అయ్యాడని.. అందరూ అయిపోతారా..వీడియో వైరల్

Dhanush: తమిళనాడులో మరో సినిమా నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అనే చర్చ హాట్ టాపిక్ అయింది. ఇటీవల ప్రముఖ నటుడు ధనుష్ చేసే కొన్ని కార్యక్రమాలను భట్టి చూస్తే ఆయన కూడా త్వరలో...
Nagendra Sai

Nagendra Sai: ఏడాదిలో 13 కొలువులు.. ఈ కడప యువకుడికి ఎలా సాధ్యమైంది.. చేసిన కృషి ఏంటి

Nagendra Sai: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రావడమే కష్టంగా ఉంది.. నోటిఫికేషన్లు వచ్చిన కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఈ పరిస్థితులు పోటీపడి కొలువు పుట్టడం అంత సులభం కాదు. లక్షల...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...
Hydra Ranganath

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...
Oktelugu Epaper