Sandeep Reddy Vanga : రీసెంట్ గానే సందీప్ వంగ(Sandeep Vanga), దీపికా పదుకొనే(Deepika Padukone) మధ్య జరిగిన కోల్డ్ వార్ నేషనల్ వైడ్ గా ఎంతటి సంచలన టాపిక్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సందీప్ వంగ త్వరలో ప్రభాస్(Rebel Star Prabhas) తో తీయబోయే ‘స్పిరిట్'(Spirit Movie) చిత్రంలో హీరోయిన్ గా తీసుకునేందుకు దీపికా పదుకొనే ని సంప్రదించాడు. స్టోరీ మొత్తం విన్న తర్వాత ఆమె సినిమా చేస్తానని చెప్పింది కానీ, ఆమె కోరిన గొంతెమ్మ కోరికలకు సందీప్ వంగ కి చిరాకొచ్చింది. నాకు వర్కౌట్ అవ్వదులేండి అని ఆమెని పక్కకి నెట్టి ‘యానిమల్’ లో సెకండ్ హీరోయిన్ గా చేసిన ‘త్రిప్తి దిమిరి’ ని హీరోయిన్ గా ఎంచుకున్నాడు. తనని కాదని, నిన్నగాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఒక హీరోయిన్ ని తీసుకోవడంతో దీపికా పదుకొనే అహం దెబ్బ తినిందని, అందుకే ‘స్పిరిట్’ మూవీ స్టోరీ ని తన పీఆర్ టీం తో లీక్ చేయించిందని సందీప్ వంగ ట్విట్టర్ పరోక్షంగా ఈమెపై మండిపడ్డాడు.
Also Read : నాగ చైతన్య గుర్తులను పూర్తిగా తుడిచేసి సమంత..సంచలనంగా మారిన వీడియో!
అయితే దీపికా పదుకొనే డిమాండ్ చేసిన ఆ డిమాండ్స్ ఏంటి?, సందీప్ వంగ ఆ డిమాండ్స్ కి ఎందుకు ఒప్పుకోలేదు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ సినిమా కోసం దీపికా పదుకొనే ని సందీప్ వంగ 35 రోజుల కాల్ షీట్స్, రోజుకి 8 గంటల సమయం అడిగాడు. కానీ దీపికా పదుకొనే కేవలం 6 గంటలు మాత్రమే పని చేస్తాను, 35 రోజులకు 25 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో పది శాతం వాటాలను ఆమె అడిగిందట. అంతే కాకుండా షూటింగ్ జరిగినన్ని రోజులు తన స్టాఫ్ కి సంబంధించిన జీతాలు కూడా మీరే చూసుకోవాలని చెప్పిందట. ఇది సందీప్ వంగ కి ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఆయన వెంటనే త్రిప్తి దిమిరి వైపు వెళ్ళాడు.
మామూలుగా అయితే దీపికా పదుకొనే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అంతకు ముందు ఎప్పుడూ కూడా తీసుకోలేదు. కేవలం 15 కోట్లకు మాత్రమే పరిమితమైంది. కానీ తెలుగు హీరో, తెలుగు డైరెక్టర్ కి సంబంధించిన సినిమా కావడంతో ఆమెకు ఇష్టమొచ్చిన లెక్కలు చెప్పుకొచ్చింది. దీంతో సందీప్ వంగ కి కోపం నషాళానికి అంటడంతో వెంటనే ఆమెని తన సినిమా నుండి తప్పించాడు. అయితే దీపికా పదుకొనే ఈ సినిమా నుండి తప్పుకున్నది అనే వార్త వచ్చిన 24 గంటలకు ఆమె అల్లు అర్జున్, అట్లీ చిత్రం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. నేడు ఆమె మా సినిమాలో భాగం కాబోతుంది అంటూ సన్ పిక్చర్స్ ఒక స్పెషల్ వీడియో తో అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాకు అన్ని ఆంక్షలు పెట్టిన దీపికా పదుకొనే కచ్చితంగా అల్లు అర్జున్ సినిమాకు కూడా అదే రేంజ్ ఆంక్షలు పెట్టి ఉంటుంది. అయినప్పటికీ ఆ మూవీ టీం ఎలా ఒప్పుకుంది అంటూ సోషల్ మీడియా లో చర్చలు మొదలయ్యాయి.