Samantha removes Naga Chaitanya memories, : సమంత(Samantha Ruth Prabhu), నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) విడిపోయినప్పటికీ వీళ్లకు సంబంధించి ఎదో ఒక గుర్తులు సోషల్ మీడియా కనిపించడం, వాటి గురించి అభిమానులు తేల్చుకోవడం వంటివి జరుగుతూనే ఉంటున్నాయి. ముఖ్యంగా సమంత శరీరం లో వెనుక భాగం పై, నడుముపై, చేతిపై నాగ చైతన్య కి సంబంధించిన టాటూలు వేసుకొని ఉండేది. పెళ్లి తర్వాత కూడా ఆ టాటూలు కనిపిస్తూ ఉండడం తో సమంత నాగ చైతన్య ని మర్చిపోలేక ఆ టాటూలను అలాగే ఉంచేసుకుంది అంటూ కామెంట్స్ చేసేవారు. కానీ రీసెంట్ గానే ఆమె తన శరీరం పై ఉన్న టాటూలను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వచ్చింది. ముందుగా నడుముపై ఉన్న టాటూ ని తొలగించుకుంది. ఆ తర్వాత చేతిపై ఉన్న టాటూ ని, ఇప్పుడు రీసెంట్ గా వీపు పై ఉన్న టాటూ ని తొలగించుకుంది. అందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
రీసెంట్ గా ఆమె మెడికల్ ఇంటర్వ్యూస్ వరుసగా చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ‘#NothingToHide’ అనే క్యాంపైన్ ని రన్ చేస్తుంది. దీని సారాంశం ఏమిటో ఇంకా తెలియదు కానీ, మిర్రర్ మీద ‘#NothingToHide’ అని రాస్తూ సమంత కనిపించిన వీడియో మాత్రం సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో ఆమె వెనక్కి తిరిగినప్పుడు గతం లో ఉన్న టాటూ ఇప్పుడు కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు అభిమానులను షాక్ కి గురి చేసిన అంశం. అంత తేలికగా టాటూ ని ఎలా తొలగించుకున్నారు?, టెక్నీక్ చెప్తే మేము కూడా అనుసరిస్తాము కదా, మా లవర్ తో బ్రేకప్ అయ్యి సంవత్సరం అయ్యింది, ఇంకా ఆమె టాటూ నా చేతి మీదనే ఉంది, ఎంత తొలగించాలని అనుకున్నా మా వల్ల కావడం లేదంటూ కొంతమంది నెటిజెన్స్ సమంత ని ట్యాగ్ చేసి సరదాగా అడుగుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే సమంత గత కొంతకాలంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు షికార్లు చేయడానికి ముఖ్య కారణం సమంత అతనితో కలిసి ఈమధ్య కాలం లో ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్లే. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభమ్’ చిత్రం విడుదల సమయంలో తిరుమల వెంకన్న స్వామి దర్శనం కోసం వచ్చింది. ఆమెతో పాటు రాజ్ నిడిమోరు కూడా ఉండడం తో వీళ్ళు కచ్చితంగా ఒక్కటి కాబోతున్నారు అనేది ఖరారు అయ్యిందంటూ చెప్పుకొచ్చారు. దానికి తోడు సమంత రాజ్ భుజం పై తల వాల్చుకొని ఫోటోలు దిగి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం వంటివి కూడా వీళ్ళు సీరియస్ రిలేషన్ లో ఉన్నారని ఖరారు అయ్యింది. కానీ సమంత అసిస్టెంట్ మాత్రం అలాంటిది ఏమి లేదని, శుభమ్ చిత్రాన్ని వాళ్లిద్దరూ కలిసి నిర్మించారని, అందుకే కలిసి ఎక్కువగా తిరిగారంటూ చెప్పుకొచ్చాడు.
View this post on Instagram