Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణమేదైనా కూడా వాళ్ళు చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ప్రస్తుతం ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా 2026 ఎండింగ్ వరకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ప్రభాస్ బ్యాక్ నుంచి ఒంటిమీద షర్టు లేకుండా బాడీ మొత్తం దెబ్బలు తగిలి కట్లు వేసుకున్నాడు. అలాగే త్రిప్తి డిమ్రీ అతనికి సిగరెట్ వెలిగిస్తూ ఉండడం విశేషం…మరి ఈ పోస్టర్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించబోతున్నాడు అనే ఒక హింట్ ఇచ్చాడు.
ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఇంతకుముందు వచ్చిన సినిమాలు సైతం ఇండియన్ సినిమా ప్రేక్షకులు అందరిని మెప్పించాయి. ఈ సినిమాతో 2026 వ సంవత్సరం మనదే అంటూ సందీప్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2000 కోట్లు కొల్లగొడుతుందనే నమ్మకంతో ఉన్నాడు.
మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇప్పటికే సందీప్ వంగ ఈ సినిమా కోసం ప్రభాస్ డేట్స్ మొత్తం లాక్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ అయిపోయేంత వరకు వేరే షూటింగ్స్ పాల్గొనకూడదు అనే ఒక కండిషన్ అయితే పెట్టాడు. కారణం ఏంటి అంటే ప్రభాస్ లుక్కు ఒకే రకంగా ఉండాలి.
వేరే సినిమా కోసం చేంజ్ చేసి మళ్ళీ ఈ సినిమా కోసం చేంజ్ చేయడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో ఇన్ని రోజులు వెయిట్ చేశాడు. నిజానికి ఫౌజీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే దాంతోపాటు ప్యార్లాల్ గా స్పిరిట్ సినిమా షూటింగ్ చేయాల్సింది. కానీ లుక్కులో తేడా వస్తుందని ఉద్దేశ్యంతోనే ఫౌజీ మూవీ షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత స్పిరిట్ సినిమా షూటింగ్ పెట్టుకున్నాడు…