https://oktelugu.com/

Sanyukta Menon : పెళ్ళైన స్టార్ హీరోతో ప్రేమాయణం..సంయుక్త మీనన్ కి ఇదేమి పాడు బుద్ధి!

ఈమె గత కొంతకాలంగా ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతుంది. ఇప్పటికే ఆ స్టార్ హీరోకి ఒకసారి పెళ్లి కూడా అయ్యిందట. అలాంటి వ్యక్తితో సంయుక్త మీనన్ ఈమధ్య రాసుకొని పూసుకొని తిరుగుతోంది అట. పెళ్ళైన వ్యక్తితో ప్రేమాయణం నడపడం ఏమిటి?, అసలు విలువలు ఉన్నాయా నీకు అని సోషల్ మీడియా లో ఈమెని ట్యాగ్ చేసి నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 5, 2024 / 09:27 PM IST

    Sanyukta Menon

    Follow us on

    Sanyukta Menon : ఈమధ్య కాలంలో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొంతమంది యంగ్ హీరోయిన్లు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సంయుక్త మీనన్. మలయాళం లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ హీరోయిన్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో సంయుక్త మీనన్ కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూలు కట్టాయి. ‘భీమ్లా నాయక్’ చిత్రం తర్వాత ఆమె చేసిన ‘బింభిసార’, ‘సార్’,’విరూపాక్ష’ వంటి చిత్రాలు భారీ హిట్స్ గా నిలిచాయి. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈమె నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ అని పిలవబడేది. ఈ సినిమాల తర్వాత ఆమె చేసిన ‘డెవిల్’ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ అనే రేంజ్ లో ఆడింది.

    ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉండే హీరోయిన్స్ లో ఒకరు సంయుక్త మీనన్. తనకి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ కురాళ్లలో హీట్ వాతావరణం ని నెలకొల్పుతూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈమె గురించి ఇప్పుడు లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న ఒక రూమర్ పెను దుమారమే రేపుతోంది. ఎందుకంటే ఈమె గత కొంతకాలంగా ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతుంది. ఇప్పటికే ఆ స్టార్ హీరోకి ఒకసారి పెళ్లి కూడా అయ్యిందట. అలాంటి వ్యక్తితో సంయుక్త మీనన్ ఈమధ్య రాసుకొని పూసుకొని తిరుగుతోంది అట. పెళ్ళైన వ్యక్తితో ప్రేమాయణం నడపడం ఏమిటి?, అసలు విలువలు ఉన్నాయా నీకు అని సోషల్ మీడియా లో ఈమెని ట్యాగ్ చేసి నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒకరి కాపురం లో నిప్పులో పోసి, ఆ హీరో ని నీవాడిని చేసుకోవాలని అనుకోవడం చాలా తప్పు, చూసేందుకు ఎంతో మంచిగా అనిపించే నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా అంటూ సంయుక్త మీనన్ ని తెగ తిట్టేస్తున్నారు నెటిజెన్స్.

    సోషల్ మీడియా లో తనపై జరుగుతున్న ఈ నెగటివిటీ పై ఆమె ఇప్పటి వరకు రెస్పాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. అంటే నిజంగానే ఆమె పెళ్ళైన హీరోతో ప్రేమాయణం నడుపుతున్నట్టే కదా లెక్క. అయితే ఇంతకీ ఆ హీరో ఎవరు ఏమిటి అనేది ఇప్పటి వరకు బయటకి రాలేదు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె నిఖిల్ హీరో గా నటిస్తున్న ‘స్వయంభు’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాణి’ అనే చిత్రం లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాతో పాటుగా రీసెంట్ గానే ఆమె మరో నాలుగు కొత్త తెలుగు సినిమాలకు సంతకం చేసినట్టు తెలుస్తుంది. అలా కెరీర్ లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా గడుపుతుంది సంయుక్త మీనన్.