Duleep trophy 2024 : బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కు ముందు స్టార్ ఆటగాళ్లు మొత్తం డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధన విధించింది. ఆ నిబంధన ప్రకారం ఆటగాళ్లు మొత్తం ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. ఈ ట్రోఫీ గురువారం అనంతపురంలో ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. అందులో ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్ చేసిన సెంచరీ ప్రత్యేకంగా నిలిచింది.
ముషీర్ ఖాన్ 227 బంతులు ఎదుర్కొని.. 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 105 పరుగులు చేశాడు. ఇండియా బీ జట్టుకు తిరుగులేని ఆధిపత్యాన్ని ఇచ్చాడు. అభిమన్యు ఈశ్వరన్ సారధ్యంలో ఇండియా బీ జట్టు కు ఆడుతున్న ముషీర్ ఖాన్.. మైదానంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఇండియా ఏ జట్టు బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించాడు. ముషీర్ ఖాన్ సెంచరీ చేయడంతో అతడి సోదరుడు.. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశాడు. ఆనంద భాష్పాలను రాల్చాడు. ముషీర్ ఖాన్ సెంచరీ చేయడమే ఆలస్యం.. గ్యాలరీలో ఉన్న సర్ఫరాజ్ చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గట్టిగా అరుస్తూ.. తన సోదరుడిని అభినందించాడు. సెంచరీ చేసిన అనంతరం ముషీర్ ఖాన్ గాల్లోకి అమాంతం అలా ఎగిరాడు.
ముషీర్ ఖాన్ సెంచరీ చేసిన అనంతరం.. గ్యాలరీలో ఉన్న జట్టు ఆటగాళ్లు మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చప్పట్లతో అభినందించారు. ముషీద్ ఖాన్ చూపించిన పటిమను అభినందించారు. సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ” సోదరుడికైనా ఇంతకంటే ఆనందం ఇంకేముంటుందని” కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుత దులీప్ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ ఇండియా బీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సర్ఫరాజ్ ఖాన్ కేవలం 9 పరుగులకే వికెట్ల ముందు దొరికిపోయాడు. ముషీర్ ఖాన్ మాత్రం సెంచరీ తో ఆకట్టుకున్నాడు.
అంతకుముందు టాస్వర్డ్ ఇండియా బీ జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఒకానొక దశలో 94 పరులకే 7 వికెట్లు కోల్పోయి కోలుకోలేని తీరుగా కష్టాల్లో పడిపోయింది. మైదానం పై ఉన్న తేమ ఇండియా – ఏ జట్టు పేస్ బౌలర్లకు అనుకూలంగా మారింది. దీంతో ఇండియా బీ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (30), అభిమన్యు ఈశ్వరన్(13) నిదానంగా బ్యాటింగ్ చేశారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ (9), రిషబ్ పంత్ (7), నితీష్ కుమార్ రెడ్డి (0), వాషింగ్టన్ సుందర్ (0), సాయి కిషోర్ (1) పూర్తిగా నిరాశపరిచారు.
ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన నవదీప్ షైనీ (74 బంతుల్లో 28*) నిదానంగా ఆడాడు. అతడి సహాయంతో ముషీర్ ఖాన్ జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు. సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్ కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మైదానం భవనలకు అనుకూలంగా ఉన్నప్పటికీ ముషీర్ ఖాన్ అద్భుతమైన డిఫెన్స్ ఆడాడు. క్లాసిక్ షాట్లతో ఆకట్టుకున్నాడు. 118 బంతుల్లో అర్ద సెంచరీ చేసిన అతడు.. 205 బంతుల్లో సెంచరీ చేశాడు. అతడు ఇన్నింగ్స్ లో పది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా బీ జట్టు 79 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 202 రన్స్ చేసింది.
19-Year-Old Shines with a Gritty Century!
Musheer Khan brings up his third first-class century, pulling his team out of a precarious position. #DuleepTrophy pic.twitter.com/2NhWJRNkHT
— SportsCafe (@IndiaSportscafe) September 5, 2024