Homeఎంటర్టైన్మెంట్Sampoornesh babu: ఓ మగాడి శీలం కోసం చేసే పోరాటమే 'క్యాలీ ఫ్లవర్​'

Sampoornesh babu: ఓ మగాడి శీలం కోసం చేసే పోరాటమే ‘క్యాలీ ఫ్లవర్​’

Sampoornesh babu: హృదయ కాలేయం సినిమాతో హీరోగా పరిచయమై.. బర్నింగ్​ స్టార్​గా గుర్తింపు పొందిన హీరో సంపూర్ణేశ్​ బాబు. ప్రస్తుతం క్యాలీ ఫ్లవర్​ అనే సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Cauliflower Movie Official Teaser | Sampoornesh Babu | Latest Movie Trailers 2021 | BhavaniHD Movies

ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నవంబరు 26న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సంపూర్ణేశ్​ బాబు మాట్లాడుతూ.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మగాడు తన శీలాన్ని కాపాడుకుంటే.. దేశంలో ఎటువంటి నేరాలు జరగవని.. ఓ మగాడి శీలం పోతే.. దాని కోసం చేసే పోరాటమే ఈ క్యాలీ ఫ్లవర కథ అని తెలిపారు సంపూర్ణేశ్​. నా సినిమాలంటే.. హృదయకాలేయం, కొబ్బరిమట్ట, సింగం 123 సినిమాలే అందరికీ గుర్తొస్తాయని.. ఇప్పుడు రాబోతున్న క్లాలీ ఫ్లవర్​ కూడా అదే స్థాయిలో అలరిస్తుందని అన్నారు సంపూ. నాలోని నటుడిని బయటకు తీసుకొచ్చి దైరెక్టర్ రాధాకృష్ణ..

మిమ్మల్ని నవ్వించేేందుకు చేసిన ప్రయత్నమే ఈ క్యాలీ ఫ్లవర్​ అంటూ పేర్కొన్నారు. కరోనా సమయంలో అన్ని నిబంధనలు పాటిస్తూ.. ఎటువంటి ఆటంకం రాకుండా సినిమా పూర్తి చేసినట్లు తెలిపారు. 20 రోజుల పాటు వరుసగా షూట్​ జరిగినందని.. షూటింగ్​ చేయడం ఓ ఎత్తైతే.. అందరికీ పని కల్పించడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ఈ సినిమా హిట్​ అయితే అది ప్రేక్షకులదే అని.. తేడా వస్తే తన నటన లోపం వల్లేనని మనస్ఫూర్తిగా స్వీకరిస్తానని అన్నారు సంపూ.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version