The Praradise Sampoornesh Babu First Look: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్'(The Praradise Movie). తనతో దసరా లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల తో రెండవసారి జత కట్టాడు నాని. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఒక స్టార్ హీరో సినిమాలు ఎలాంటి బజ్, హైప్ రావాలో, అలాంటి బజ్ ఈ సినిమాకు కేవలం ఆ ఒక్క గ్లింప్స్ వీడియో ద్వారా క్రియేట్ అయ్యింది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26 న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వాయిదా పడింది అంటూ చాలా వార్తలు వచ్చాయి కానీ, నాని మాత్రం ఆ డేట్ ని మిస్ చేసుకోవడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. జనవరి నెలాఖరు లోపు షూటింగ్ పూర్తి అవ్వాలని డైరెక్టర్ కి డెడ్ లైన్ పెట్టాడట.
ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఆయన వెండితెర మీద కనిపించబోతున్న చిత్రమిది. అదే విధంగా కాసేపటి క్రితమే నాని ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు క్యారక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసాడు. ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబు ఉన్నాడు అనే విషయం ఇప్పుడే తెలిసింది. ఇందులో ఆయన క్యారక్టర్ పేరు బిర్యాని అట. చేతిలో కత్తి పట్టుకొని, నోట్లో బీడీ పెట్టుకొని కాలుస్తూ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు సంపూర్ణేష్ బాబు. ఇన్ని రోజులు ప్యారడీ సినిమాలు, కామెడీ సినిమాలు చేసుకుంటూ వచ్చిన సంపూర్ణేష్ బాబు లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని ఫస్ట్ లుక్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.
సంపూర్ణేష్ బాబు మంచి నటుడే, కానీ ఎంతకాలం ఇలాంటి ప్యారడీ సినిమాలే చేస్తూ ఉంటాడు?, డిఫరెంట్ తరహా పాత్రలు చేస్తుండాలి కదా, అలాంటి పత్రాలు పోషించే సత్తా అతనిలో ఉంది కదా? అంటూ సోషల్ మీడియా లో అనేక కామెంట్స్ వినిపించాయి. ఆయన వరకు ఈ కామెంట్స్ చేరాయేమో తెలియదు కానీ, ‘మండేలా’ అనే మంచి చిత్రం తో గత ఏడాది మన ముందుకు వచ్చాడు. కానీ ఆడియన్స్ గుర్తించలేదు. ఇప్పుడు ఇంత పెద్ద పాన్ ఇండియన్ సినిమాలో ఆయనకు ఆడియన్స్ గుర్తించుకోదగ్గ బలమైన క్యారెక్టర్ తగిలింది. ఈ క్యారక్టర్ క్లిక్ అయితే సంపూర్ణేష్ బాబు ఆర్టిస్ట్ గా మరోసారి ఫుల్ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.
Sampoo as BIRYANI 🙂#TheParadise @sampoornesh pic.twitter.com/VuY02LW6F8
— Nani (@NameisNani) December 19, 2025