Sampoornesh Babu: తెలుగు ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu). సినిమాల మీద సెటైర్స్ వేస్తూ ‘హృదయకాలేయం’ అనే చిత్రం ద్వారా ఈయన వెండితెర అరంగేట్రం చేసాడు. అప్పట్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చూసి ఎవరీ సంపూర్ణేష్ బాబు, ఇంత విచిత్రం గా ఉన్నాడు అని కామెంట్స్ చేసేవారు. రాజమౌళి సైతం ఈయన ఈ సినిమా గురించి అప్పట్లో ట్వీట్ వేసాడు. అలా పాపులారిటీ ని సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు, అదే తరహా సినిమాలు చేస్తూ, ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తూ కెరీర్ ని ముందుకు సాగిస్తున్నాడు. కేవలం కామెడీ సినిమాలు మాత్రమే కాదు, తనలోని నటుడిని బయటకి తీసే ‘మండేలా’ లాంటి సందేశాత్మక సినిమాలు కూడా చెయ్యగలను అని నిరూపించాడు. ఇకపోతే నేడు కార్మికుల దినం సందర్భంగా ఆయన విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read: ‘హిట్ 3’ ట్విట్టర్ టాక్ వచ్చేసింది..క్లైమాక్స్ ట్విస్ట్ ఆ రేంజ్ లో ఉందా!
ఆయన మాట్లాడుతూ ‘అందరికీ కార్మిక దిన శుభాకాంక్షలు..తాజ్ మహల్ నిర్మాణం లో రాళ్లు ఎత్తిన కూలీ, కార్మికుడు. ప్రభువు ఎక్కిన పల్లకిని మోసేది కూడా కార్మికుడే. ఆధునిక ప్రపంచ నిర్మాణం లో అలుపెరుగని యోధుడు కార్మికుడు. ప్రపంచం లో కులం, మతం లేనటువంటి ఒకే ఒక్క వర్గం కార్మిక వర్గం. మే డే ఎంతో మంది కార్మికుల రక్త తర్పణాలు వల్ల ఆవిర్భవించింది ఈరోజు. గొడ్డు చాకిరి చేసే కార్మికుడు కన్నెర్ర చేస్తే పుట్టింది ఈరోజు. మనిషి అనే వాడు రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేయాలి అని వర్కింగ్ షెడ్యూల్ వచ్చిందే ఈరోజు. బ్రిటన్ లో 1780 లో పుట్టిన ఈ విప్లవం, ప్రపంచం మొత్తం వ్యాపించి ఎంతో మంది కార్మికుల జీవితాలను మార్చింది. చెప్పండి మీ పిల్లలకి, మే డే అంటే హాలిడే కాదు, మన డే అని. కష్టాన్ని నమ్ముకొని చమటోడ్చే ప్రతీ ఒక్కడి డే అని చెప్పండి. జై కార్మిక..జై జై కార్మిక..కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
కార్మికుల దినం గురించి ఇంత అద్భుతంగా మాట్లాడిన సినీ సెలబ్రిటీ ఎవ్వరూ లేరు. సంపూర్ణేష్ బాబు ని ట్రోల్ చేయడానికి అందరూ మీమ్స్ కోసం వాడుతుంటారు కానీ, ఆయనలో గొప్ప సామజిక స్పృహ కూడా ఉందని ఇలాంటి సందర్భాలు చూసినప్పుడే తెలుస్తుంది. సినిమా షూటింగ్స్ లేని సమయం లో సంపూర్ణేష్ బాబు తన పల్లెటూరు కి వెళ్లి పొలం పనులు చూసుకుంటాడు. సినిమాల్లోకి రాకముందు ఏ పనులైతే చేసేవాడో, అవన్నీ ఇప్పుడు కూడా చేస్తున్నాడు. నిత్యం కష్టపడే తత్త్వం ఉన్న వ్యక్తి కాబట్టే, ఆయనలో ఇలాంటి భావాలు ఉన్నాయని సంపూర్ణేష్ బాబు సన్నిహితులు పలు ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. ఇకపోతే సంపూర్ణేష్ బాబు లేటెస్ట్ గా సోదర అనే చిత్రం చేసాడు. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ అద్భుతమైన సందేశం ఇచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు. pic.twitter.com/oYtcZBIDta
— BIG TV Breaking News (@bigtvtelugu) May 1, 2025