Sammathame Collections: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన ‘సమ్మతమే’ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి ?, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ రేంజ్ లో కలెక్ట్ చేసింది ?, ఈ సినిమా నిర్మాత కంకణాల ప్రవీణకు లాభాలు వచ్చాయా ? లేక, నష్టాలే మిగిలాయా ? చూద్దాం రండి. ముందుగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: 8 Movies Releasing: ఒకేరోజు 8 సినిమాలు రిలీజ్.. కానీ అన్నీ వాష్ అవుటే !
నైజాం 0.28 కోట్లు
సీడెడ్ 0.10 కోట్లు
ఉత్తరాంధ్ర 0.09 కోట్లు
ఈస్ట్ 0.04 కోట్లు
వెస్ట్ 0.03 కోట్లు
గుంటూరు 0.06 కోట్లు
కృష్ణా 0.05 కోట్లు
నెల్లూరు 0.03 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్స్ గానూ 0.68 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 0.98 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.08 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ 0.76 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ ‘సమ్మతమే’ రూ. 1:13 కోట్లను కొల్లగొట్టింది
‘సమ్మతమే’ చిత్రానికి రూ.5.88 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.74 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇప్పుడున్న లెక్కలను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అవ్వడం కష్టమే. మొత్తంగా ‘సమ్మతమే’ కలెక్షన్ల విషయంలో అ’సమ్మతమే’.
Also Read:Vikram 3 Weeks Collections: కమల్ కెరీర్ లోనే మిరాకిల్ ఇది !